ఆకాశ పందిరి.. భూలోక సందడి అని పెళ్లి చేశారో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరే ఆలోచించుకోండి. ఎవరికైన పెళ్లి అనేది ఒక కల. అది ఎంతో అద్భుతంగా జరుపుకోవాలి అని.. మర్చిపోలేని రోజుగా ఉండాలి అని అందరూ అనుకుంటారు. అలానే చేసుకుంటారు కూడా. ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ కరోనా పుణ్యమా అని అది సాధ్యం కావడం లేదు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ కారణంగా పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరగడం లేదు.. తెలంగాణ సర్కార్ కఠిన నిర్ణయాలలో ఈ పెళ్లిళ్లు బాలి అయ్యాయి అంటే నమ్మండి. కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది కలలు అవిరి అయ్యాయి. పెళ్ళికి 200కు మించి వచ్చారు అంటే పెళ్లి మండపంను సీజ్ చేస్తారు. అంతేకాదు పెళ్లి మండపం రెంట్ కి ఇచ్చిన యజమానిని.. తీసుకున్న వ్యక్తికి ఫైన్ వేసి కేసు నమోదు చేసి కటకటాల వెనక్కు నెట్టేస్తారు. 

 

సీఎం కేసీఆర్ ఆదేశాలతో మ్యారేజీ హాల్స్‌ మీద ఓ కన్నేసి ఉంచిన పోలీసులు ఫైన్ లు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ చెప్పినా.. పోలీసులు చెప్పినా.. ఎవరు చెప్పినా.. మేం చేసేది చేస్తాం అనే వాళ్లకు పోలీసులు గట్టి షాకే ఇస్తున్నారు. భారీగా ఫైన్‌ వేసి.. మండపాలకు తాళాలు వేస్తున్నారు. నిర్మల్ పట్టణ పోలీసులు.. ఈ విధంగా మూడు మ్యారేజి హాల్స్ ను ఇప్పటికే లాక్‌ చేసేశారు. 

 

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌ 51 కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇక ఎన్నో ఫంక్షన్‌ హాల్స్‌ దగ్గర పోలీసులే ముందు జాగ్రత్తలు తీసుకుంటు పెళ్లిలో జనాలు గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు కరోనా వైరస్ వ్యాప్తిపై జనాలకు అవగాహనా కల్పిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: