కరోనా వైరస్....ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క పేరు. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు గజగజలాడుతున్నారు. చైనా దేశంలో మొదలైన ఈ వైరస్ ప్రపంచాన్నే చుట్టేసింది. ఈ వైరస్ దెబ్బకు 10 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా లక్షలాదిమందికి ఈ వైరస్ సోకింది. అయితే ఈ విధంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రజలకు పూర్తి అవగాహన ఉందా? అంటే పెద్దగా లేదనే చెప్పాలి. ప్రస్తుతానికి ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తుండటంతో, ప్రజలు కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

అయితే కరోనా వైరస్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అసలు ఈ కరోనా వైరస్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక అందులో ఏ రకం బాగా డేంజర్ అనేది మాత్రం ప్రజలకు పూర్తిగా తెలియదు. కాకపోతే చైనాలో కరోనా ప్రభావం ఎక్కువ ఉండటంతో, ఆ దేశం కోవిడ్-19 గురించి కొన్ని పరిశోధనలు చేసి, కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వైరస్‌లో రెండు రకాలు ఉన్నట్లు వారు నిర్ధారించారు. అవి వచ్చి ‘ఎల్’ రకం, ‘ఎస్’ రకం.

 

ఈ రెండు రకాల్లో ఏది ప్రమాదకారి అన్న విషయానికి వస్తే... ఎస్ కంటే కూడా ఎల్ రకం వైరస్ చాలా డేంజరస్ అని తెలుస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికిపైనే కోవిడ్-19 బాధితులు ఉన్నారు. ఇక వారిలో ఎల్ రకం వైరస్ ఉన్నవారే ఎక్కువమంది ఉన్నారట. ఈ ఎల్ రకం ఉంటే ఇంకా వారు చాలా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని అర్ధం. అలాగే ఈ కరోనా వైరస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే...దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది.

 

మామూలుగా ఏటా ప్రపంచంలో చాలారకాల ఫ్లూ వైరస్‌లు వస్తుంటాయి. వాటి వల్ల ప్రపంచ దేశాల్లో  30 వేల నుంచి 65 వేల మంది చనిపోతున్నారు. ఇక ఈ కోవిడ్-19 వల్ల కేవలం రెండు నెలల్లోనే 10 వేల మందికి పైగా చనిపోయారు. ఇంకా రెండు లక్షల మందికి పైనే ఈ వైరస్ బారిన పడ్డారు. ఇంకా వారిలో మరణం అంచునా ఉన్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీని బట్టి చూసుకుంటే అన్ని రకాల ఫ్లూ వైరస్ కంటే కూడా కోవిడ్- 19 మరింత ప్రమాదకారేనన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: