దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రేపు పెట్రోల్ బంకులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ బంకుల మూసివేత నేపథ్యంలో బంకులకు వాహనదారుల తాకిడి పెరిగింది. రేపు ఏపీలో పెట్రోల్ బంకులు మూతబడనున్నాయి. సోమవారం నుంచి యథావిథిగా పెట్రోల్ బంకుల సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో పెట్రోల్ బంకుల మూసివేతపై యజమానుల సమావేశం జరుగుతోంది. 
 
సమావేశం అనంతరం పెట్రోల్ బంకుల మూసివేత గురించి కీలక నిర్ణయం వెలువడనుంది. తెలంగాణలో రేపు హైదరాబాద్ మెట్రో సర్వీసులు కూడా నిలిపివేసే అవకాశం ఉందని సమాచారం. మరికాసేపట్లో ప్రభుత్వం మెట్రో సర్వీసుల నిలిపివేత గురించి నిర్ణయాన్ని ప్రకటించనుంది.ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. 
 
మరోవైపు భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 258కి పెరిగాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 20 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు రాష్ట్రాల సీఎంలు జనతా కర్ఫ్యూ దిశగా చర్యలు చేపడుతున్నారు. రేపు ఇబ్బందులు పడకుండా ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. 
 
ఈరోజు అర్ధరాత్రి నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఢిల్లీ మెట్రో సర్వీసులు బంద్ కానున్నాయి. ఏపీలో ఇప్పటికే మాల్స్, థియేటర్లు మూతబడ్డాయి. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు వీలైనంత వరకు బయటకు రావొద్దని సూచిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆటోడ్రైవర్లు మీడియాతో వాపోతున్నారు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఇరు రాష్ట్రాల సీఎంలు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నాడు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: