కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తూ  శరవేగంగా ప్రపంచవ్యాప్తంగా పాతుకుపోయిన విషయం తెలిసిందే. ఎన్ని కఠిన నిబంధనలు అమలు లోకి తీసుకొచ్చిన కరోనా వైరస్ ప్రభావం మాత్రం ఆగడం లేదు. మొదట ఈ మహమ్మారి వైరస్ చైనా దేశంలోన వుహాన్  నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్ నెలలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాలో  మరణ మృదంగం మోగించింది. దీంతో ప్రతి రోజు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం తో పాటు... కరోనా  వైరస్ బారినపడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. కరోనా వైరస్ ప్రభావంతో చైనా మొత్తం విలవిలలాడి పోయింది. అయితే ప్రస్తుతం చైనా దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. 

 

 

 ఇతర దేశాలలో మాత్రం విజృంభిస్తుంది ఈ మహమ్మారి వైరస్. అయితే ఒక్కసారిగా చైనా దేశంలో కరోనా వ్యాప్తి తగ్గిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. గడిచిన నాలుగు రోజుల నుండి అక్కడ కొత్తగా ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. చైనా దేశంలో మొత్తం 81,008 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా... ప్రస్తుతం 71, 740 మంది కరోనా వైరస్ నుంచి రికవరీ అవుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం చైనా దేశంలో కరోనా వైరస్ బారినపడి 3257 మంది మృతి చెందారు.అంతేకాకుండా వీరిలో 6013 మందికి ఆక్టివ్ కేసులు ఉండగా... వారిలో 4086మంది కరోనా బాధితులు కోలుకుంటున్నారు. అయితే ఫిబ్రవరి 12వ తేదీన ఒకేరోజు 14308 కరోనా పాజిటివ్  కేసులు నమోదైన చైనా దేశంలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్చి 12వ తేదీ వరకు కొత్తగా నమోదైన కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య సున్నా కు చేరుకుంది. 

 

 

 దీనిబట్టి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా దేశంలో ఇంత సత్వరంగా మార్పులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే కరోనా  వైరస్ నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం వల్ల కరోనా  వైరస్ నియంత్రణ సాధ్యమైందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుతం  చైనాలో  ఉన్న పరిస్థితులను బట్టి కరోనా  వైరస్ ప్రభావం పై ఎంతటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అది కూడా ప్రపంచంలోనే అత్యధిక ఉన్న చైనాలో... కరోనా  వైరస్ విజృంభిస్తూ  విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో... ఇంత తక్కువ కాలంలో కరోనా  వైరస్ ను  జయించడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది చైనా ప్రభుత్వం. ప్రజలెవరూ సమూహాలుగా తిరగకుండా నిర్వహించాలంటూ ఆదేశించింది. దీని కోసం కేవలం ప్రకటనలు విడుదల చేసి ఊరుకోకుండా.. పర్ఫెక్ట్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఆచరణలో పెట్టడం తో... రోడ్లమీద జనసంచారం తగ్గి.. చైనాలో రోజురోజుకు కరోనా వైరస్ కట్టడి  అయ్యింది. ఇక మీడియా సోషల్ మీడియా పై కూడా నియంత్రణ వేసింది చైనా ప్రభుత్వం. అంతే కాకుండా ఆరు రోజుల్లోనే 1000పడకల ఆసుపత్రి నిర్మించడం లాంటి సాహసోపేతమైన చర్యలు చేపట్టడం వల్ల చైనా దేశం కరోనా వైరస్ ను  నియంత్రించగలిగింది అని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: