తానున్న చెట్టు త‌గ‌లిబ‌డి పోతుంటే.. క‌నీసం ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తారు ఎవ‌రైనా!  అయితే, త‌న‌కు రాజ‌కీ యంగా బ‌లమైన కేడ‌ర్‌ను ఇచ్చి, ప‌ద‌వులు ఇచ్చి, అనేక రూపాల్లో ల‌బ్ధి పొందేలా చేసిన పార్టీ ప్ర‌స్తుతం ఇ క్క‌ట్లు ఎదుర్కొంటుంటే.. ఏ నాయ‌కుడైనా ఏం చేయాలి?  పార్టీని ఎలా ర‌క్షించుకునేందుకు ప్ర‌య‌త్నించా లి. మ‌రి ఇలాంటి విశ్వాసం, విజ్ఞ‌త టీడీపీ లోని సీనియ‌ర్ నాయ‌కుల్లో ఉందా? అంటే .. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సంక‌ట ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. కొన్ని జిల్లాల్లో జండా ప‌ట్టుకునే నాయ‌కుడు కూడా క‌ర‌వ‌య్యారు. మ‌రికొన్ని చోట్ల వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి.



ముఖ్యంగా టీడీపీకి కంచుకోట వంటి తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి పార్టీని నామ‌రూపాలు లేకుండా చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే బారీ ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అనేక మంది తూర్పు నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకుంది. అయితే, ఈ జిల్లాలో కీల‌క‌మైన నాయ‌కుడు, మాజీ హోం మంత్రి, ప్ర‌స్తుతం పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న పార్టీని బ‌లోపేతం చేసేందుకుకానీ, పార్టీ నుంచి సైకిల్ దిగుతున్న నాయ‌కుల్లో ఆత్మ‌స్థ‌యిర్యం చెప్ప‌డంలోకానీ, బూత్ క‌మిటీల వారిగా స‌మావేశాలు ఏర్పాటు చేయ‌డంలోకానీ విఫ‌ల‌మ‌వుతున్నారు.,



కేవ‌లం త‌న ఎమ్మెల్యే సీటు, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న హ‌వా సాగితే చాలు.. పార్టీ ఏమైనా ప‌ర్వాలేదు అనే ధోర‌ణిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే చినరాజప్పపై ఆగ్రహంతో గంగుమళ్ల కాసుబాబు, అరిగెల బుజ్జి తదితరులు మంత్రి పినిపే విశ్వరూప్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. టీఎన్‌టీయూ సీ నాయకుడు, నరనరానా టీడీపీని జీర్ణించుకున్న గల్లా రాము వంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలోకి వచ్చేశారు. అమలాపురం 25వ వార్డు మాజీ కౌన్సిలర్‌ బండారు సత్యనారాయణ, అంబాజీ పేట మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బండారు లోవరాజు(చిన్ని) వైఎస్సార్‌ సీపీలో చేరారు.



నిజానికి సుదీర్ఘ కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన రికార్డుతో పాటు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా పని చేశారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన కూడా దాదాపు కన్నెత్తి చూడడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజక వర్గం అమలాపురంలో కూడా పార్టీ ముఖ్య నేతలు వైఎస్సార్‌ సీపీలో చేరుతూ రాజప్పకు గట్టి షాక్‌ ఇస్తున్నా రు. ఇవ‌న్నీ తెలిసి కూడా రాజ‌ప్పఏమీ తెలియ‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి. త‌న కాళ్ల కింద‌కి నీళ్లు వ‌చ్చేదాకా ఎదురు చూస్తారా? అనే చ‌ర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: