దేశంలో కరోనా బాధితుల సంఖ్య 271కు చేరింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడానికి ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు అవసరం ఉంటే మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నాయి. ప్రభుత్వ విజ్ఞప్తులతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా ప్రభావంతో దినసరి కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 
 
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోజు వారీ కూలీలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటివరకూ 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం ఏప్రిల్ నెలలోనే వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ఏప్రిల్, మే నెలల పెన్షన్ ను అందజేయనుంది. 
 
సీఎం భవన నిర్మాణ రంగంలో పని చేసే 20.37 లక్షల మంది కార్మికులకు, 15 లక్షల మంది రోజువారీకూలీలకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నగదును నిత్యావసర వస్తువుల కొనుగోలు కొరకు, పనులకు ఉపయోగించాలని సూచించారు. వీరిలో ఇప్పటివరకు 9 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. సీఎం రేషన్ కార్డులు లేకపోయినా ఉపాధి హామీ కార్డులు ఉన్నవారికి 20 కిలోల గోధుమలు, 15 కిలోల బియ్యం అందజేస్తామని చెప్పారు. 
 
రాష్ట్ర మంత్రులు ఇళ్ల నుంచే పని చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దిశగా రోజు వారీ పనులు చేసేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. కరోనా ప్రభావంతో కూలి పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: