ప్రపంచానికి ఎంత పెద్ద ముప్పు వాటిల్లిందో ఈ జనానికి అర్ధం అవడం లేదు.. ఎవరికి ఎవరు పట్టించుకోకుండా నాకేం కాదు అనే ధీమాలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. ఇక సమస్యను ఎవరు సృష్టించారు అని వాదించుకునే కంటే, కళ్లముందు ఉన్న ప్రమాదం నుండి ఎలా భయటపడాలనే ఆలోచనతో జీవించడం ఉత్తమం.. మరి ఎంత మంది ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారంటే.. ఇలాంటి వారిని వేళ్లమీద లెక్కపెట్ట వచ్చును.. అయితే ఇంతటి నిర్లక్ష్యానికి ఫలితం లక్షలాది ప్రజల ప్రాణాలని ఎవరు ఊహించడం లేదు..

 

 

కానీ ఈ పరిస్దితి ఇలాగే కొనసాగితే మాత్రం అప్పుడు కుటుంబీకులను, బంధువులను, చివరికి కన్న బిడ్దలను కూడా కోల్పోయాక అయ్యోరామా అంటూ తలలు పట్టుకుని కూర్చుంటే పోయిన వారు తిరిగి రారు.. ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుందని కొందరు ప్రశ్నించవచ్చు. అదే చెబుతున్నా.. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోన్న ప్రమాదకారి ఈ కరోనా వైరస్‌.. దీనిని కనుక సకాలంలో నిరోధించకపోతే రాబోయే రోజుల్లో లక్షలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరిస్తు ఉన్నారు..

 

 

ఒక వేళ రోగం వచ్చినప్పుడు చూద్దాం అని నిర్లక్ష్యం చేస్తే, లక్షల సంఖ్యలో ప్రజలు పరిస్థితి చేయిదాటిన ప్రాంతాల్లో మరణించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 11 వేల మందిని పొట్టనబెట్టుకున్న ఈ కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక, ఆరోగ్య పరిస్థితులు దిగజారాయని, ఇంకా పరిస్దితులు చితికిపోకముందే బయట పడాలంటే తక్షణమే ప్రపంచదేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.. ఇదే కాకుండా ఈ సమయంలో స్వార్ధంతో కాకుండా, ప్రతిదేశం కలిసికట్టుగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ కోవిడ్ 19ను ఎదుర్కోవాలి..

 

 

ఇక ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగాలేని దేశాలకు సహకారం అందించాలి.. ఈ విషయంలో ముఖ్యంగా జీ20 దేశాలు ముందుండాలని అభిప్రాయపడింది.. ఇక ఇప్పటికే ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోకున్నా కరోనా మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లుతుంది.. ఇది ఇంతటితో ఊరుకోదు త్వరలోనే అన్ని దేశాలకు పాకి ప్రాణాంతకంగా మారుతుంది.. అప్పుడు మరణించిన శవాలను పక్కనపెట్టుకుని కాలాన్ని వెల్లదీసే పరిస్దితులు రావచ్చూ.. ఇక ఈ వైరస్ వల్ల ప్రపంచానికి మాంద్యం ముప్పు పొంచి ఉందని, ఈ సమయంలో కరోనా వైరస్ నిరోధానికి దేశాలు చేపట్టిన చర్యలు ఏ మాత్రం సరిపోవని అభిప్రాయపడింది.

 

 

ఇదే తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలుతున్న ఆర్థికవ్యవస్థలపై కూడా దృష్టిసారిస్తూ, అల్ప ఆదాయ వర్గాలు, చిన్న, మధ్య తరహా వ్యాపారులను కూడా ఆదుకోవాల్సి ఉందని సూచించింది.. ఒకవేళ వ్యూహత్మకంగా వ్యవహరించకపోతే మాత్రం రాబోయే పరిస్దితులు మనిషిని బ్రతకడం కంటే చావడం నయం అనేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: