కంటికి కనిపించని మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎలా దాడి చేస్తుందో కూడా తెలియని ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం మనుషుల ప్రాణాలు తీస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను మొత్తం చిగురుటాకులా వణికిస్తోంది . ఈ వైరస్ ను  ఆపేందుకు ఎంత ప్రయత్నం చేసినా మరింతగా విజృంభిస్తుంది మహమ్మారి వైరస్. ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న మహమ్మారి కరోనా   వైరస్... ఇందులో భాగంగా భారతదేశంలో కూడా అడుగుపెట్టి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఎన్ని కఠిన నిబంధనలు తెరమీదకు తెచ్చినపటికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 

 

 

 దీంతో భారత ప్రజలు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ కు సరైన విరుగుడు లేకపోవడం... నివారణ ఒక్కటే మార్గం అవ్వడంతో ప్రజల్లో  మరింత ప్రాణభయం పాతుకుపోయింది. ఇక ప్రజల్లో ధైర్యం నింపి అవగాహన చర్యలు చేపడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా  వైరస్ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రజలకు సూచిస్తూనే... ప్రజలు ఎక్కడ సమూహాలుగా ఉండకూడదు అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఎక్కడ గుమిగూడి ఉండకుండా ప్రస్తుతం కఠిన నిబంధనలను అమలు లోకి తెస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ కరోనా విజృంభన మాత్రం ఆగడం లేదు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏకంగా 275 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

 

 ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే పరిస్థితి చేయి దాటి పోతున్నట్టుగా కనిపిస్తుంది. నాగ్ పూర్  సమూహాల ద్వారా కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.. పూణేలో విదేశాలకు వెళ్లే మహిళలకు కూడా కరోనా వైరస్  కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో రోజురోజుకు కరొన  వైరస్ విజృంభన  పెరుగుతుండడంతో రైళ్లు బస్సులు కూడా బంధు చేయాలనే యోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా బంద్ నెలకొన్న విషయం తెలిసిందే. విద్యాసంస్థలు సినిమా హాళ్లు షాపింగ్ మాల్స్ ఇలా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు అన్నింటిని  మూసివేస్తూ  కీలక నిర్ణయం తీసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: