చాలి చాలని డబ్బు సంపాదన తో ఒక కుటుంబాన్ని పోషించాలనుకుంటే సామాన్యుడికి కత్తి మీద సాము లాంటిదే. కుటుంబం భారం మోయలేక అప్పు తెచ్చుకుని నాలుగు మెతుకులు నోట్లో వేసుకున్న ఆ రోజు గడుస్తుంది. ఒక పక్క తెచ్చిన అప్పు, మరో పక్క వడ్డీ, కుటుంభం భారం మోయలేక, అప్పులు కట్టలేక ఒక కుటుంబం ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే అమలు చేసింది.

 

అదేంటంటే కుటుంబం మొత్తం  ఆత్మహత్య  చేసుకుంది.  మొత్తం ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అందులో కంటికి రెప్పలా కని పెంచిన కూతురు కూడా ఉంది.వివరాలలోకి వెళితే ఈ విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జలుమూరు మండలం కొత్తపేట గ్రామంలో జరిగింది.

 

కుటుంబ పోషణ కోసం  శంకర్రావ్  తెలిసిన వాళ్ళ దగ్గర  కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకి  అప్పులిచ్చిన వారి వేధింపులు ఎక్కువవడంతో దిక్కుతోచని స్థితిలో భార్యాభర్తలు కళావతి, శంకర్రావ్ తమ కుమార్తె గీతాంజలితో సహా పురుగుల మందు తాగారు. చుట్టుపక్కల వారు  ఇంట్లోని సభ్యులు ఎవరు బయటకి రాలేదని అనుమానం వచ్చి వెళ్లి చూస్తే భర్త, భార్య,  కూతురు  ముగ్గురు విగత జీవుల్లా పడి ఉన్నారు. స్థానికులు వాళ్ళని చూసి షాక్ అయ్యారు. 

 

అయితే స్థానికులు వారిని హడావుడిగా  నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందడంతో కొత్తపేట గ్రామంలోని వారు అంతా విచారణ చెందుతున్నారు. ఒక్కసారిగా ఊరు అంతా నిశబ్ద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమయినా ఆత్మహత్య చేసుకోడం సరి అయిన పద్ధతి కాదు అని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: