కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కాకుండా ఉండేందుకు ప్రధాని మోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశమంతా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజలంతా ఇళ్ల బాల్కనీలు, ద్వారాల వద్దకు వచ్చి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విశేషంగా సేవలందిస్తున్న సిబ్బందికి మద్దతుగా 5 నిమిషాల సేపు నిలబడి చప్పట్లు, గంటలు మోగిస్తూ సంఘీభావం తెలియ చేయాలని అన్నారు.

 

దీనికి సంకేతంగా సాయంత్రం 5 గంటల సమయంలో అధికారులు సైరన్‌ మోగిస్తారని, దీనికి అంతా సమాయత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జనతా కర్ఫ్యూపై స్పందించారు. ఈ కర్ఫ్యూ తెలంగాణ ప్రజలు కూడా పాటించాలని, కాకపోతే ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అంటే 24 గంటల పాటు కర్ఫ్యూ పాటించాలని కోరారు. ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావోద్దని, అయితే అత్యవసరమైన సేవలు మాత్రం కొనసాగుతాయని చెప్పారు.  

 

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్..బీజేపీ నేతలని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. ప్రధాని ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరోనా వ్యాప్తి చెందకుండా సేవలు అందిస్తున్న సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే ఆ కార్యక్రమాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని, ఇది జాతీయ ఐక్య‌త కోసం దీనిపై కొంద‌రు చిల్ల‌ర‌గాళ్లు చిల్ల‌ర కామెంట్లు చేస్తున్నారని, అలాంటి వాళ్ల‌ను జైల్లో ప‌డేయాల‌ని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కామెంట్లు పరోక్షంగా బీజేపీ నేతలని ఉద్దేశించే కేసీఆర్ వ్యాఖ్యానించారని అర్ధమవుతుంది. మొత్తానికైతే ఇన్‌డైరక్ట్‌గా మోదీకి కౌంటర్ ఇచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: