కరోనా కేవలం ఆరోగ్యానికే  కాదు. ఆనాటి సంస్కృతీ, సంప్రదాయాలకు కూడా అడ్డు వస్తోంది. ఏమిటో ఎప్పటికి ఈ మహమ్మారి బాధ తొలగి పోతుందో అని చూస్తూ ఉన్నారు జనం. ఇప్పటికే శ్రీవారి దేవాలయాన్ని బంద్ చేసేసారు . అలానే అన్నవారం సత్తన్న ఆలయం కూడా మూసేసారు. ఇవన్నీ ఒకటి అయితే ఇప్పుడు తెలుగు వారి ప్రత్యేకమైన ఉగాది వస్తోంది.

 

 

ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఆచారం. అయితే ఈ కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ పంచాంగ శ్రవణాన్ని ఆన్లైన్ లో చూసుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ మహమ్మారి రాములోరి కల్యాణాన్ని కూడా అడ్డుకుంటంది. తెలంగాణ మంత్రి  ఇలా అన్నారు. ఈ సారి పంచాంగ శ్రవణం , శ్రీ రామ నవమి వేడుకల్ని లైవ్ టెలికాస్ట్ లో మాత్రమే వీక్షించాలి  అని. 

 

కేవలం ప్రజలపై మాత్రమే కాదు దేవుళ్ళ పై కూడా పడిపోయింది ఆ వ్యాధి ఎఫెక్ట్. ప్రతి ఏటా హైదరాబాద్ రవింద్ర భారతి లో భారీ ఎత్తున పంచాంగ శ్రవణం చేస్తారు . అయితే ఈసారి ఈ భారీ కార్యక్రమాలకి ఫుల్స్టాప్ పెట్టి లైవ్ టెలికాస్ట్ తో తృప్తి పడక తప్పదు. ఇంతే కాకుండా భద్రాద్రి లో ఉన్న సీత రాముల వారి కళ్యాణం రోజు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.

 

అక్కడకి భారీ ఎత్తున ప్రజలు వచ్చి దర్శించుకుంటారు . కానీ ఈ ఏడాది అక్కడ రాముల వారి కల్యాణానికి అనుమతే లేదు. ప్రజలు వెళ్ల కూడదని చెప్పారు . భక్తులు ఎవ్వరికి కూడా అనుమతి లేదు అంటూ చెప్పుకొచ్చారు . అలానే ప్రభుత్వం స్వామి వారికి పట్టు వస్త్రాలని సమర్పిస్తాం, తలంబ్రాలు సమర్పిస్తాం అని అన్నారు. ప్రజలు కేవలం ఇంట్లోనే ఉంది లైవ్ చూడాలి కానీ ఆలయాలని దర్శించకూడదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: