భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రజలందరూ చిగురుటాకులా వణికిపోతారు. ఈ కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా భారీగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా వైరస్ తో కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసిన ప్రతి రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి  మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే భారతదేశం మొత్తం స్వీయ నిర్బంధం  దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు,  షాపింగ్ మాల్,  సినిమా హాల్ వేస్తూ ఎక్కడ జనసమూహం ఉండకుండా చూస్తుంది తెలంగాణ సర్కార్. 

 


 అయితే రోజురోజుకు తెలంగాణలో కరోనా  వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.. తెలంగాణలో కరోనా సోకిందంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారందరూ విదేశాల నుంచి వచ్చిన వారే అంటూ కేసీఆర్ వెల్లడించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి  కరోనా  అనుమానితుల పై నిఘా  పెట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

 

 

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ వ్యాప్తి పెరిగిపోవడానికి విదేశీయులే కారణమంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20 వేల మంది విదేశీయులు వచ్చారు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే దానిని ఓ విలేకరి ఇప్పటికే 20 వేల మంది వచ్చారు కదా... మరి ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్న వేయబోయింది... దీంతో ఆ విలేకరి పై ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఇదే ప్రశ్న... ఏ పేపర్ నీది... ఈ టైంలో ఏ ప్రశ్న అడుగుతున్నావు  అంటూ ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. విలేకరి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందించిన తీరు తో అక్కడున్న మీడియా వాళ్లు అందరూ అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: