కరోనా వైరస్ వల్ల భూమ్మీద ఎన్నడూ లేనంతగా భయం ప్రజలలో నెలకొంది. భూమి మీద ఉన్న అన్ని అన్ని దేశాల ప్రజలు ఇళ్ల కే పరిమితమై పోతున్నారు. బడా బడా కంపెనీలు, షాపింగ్ మాల్స్, సినిమా ధియేటర్లు కాలేజీలు స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. చాలా వరకు బయటికి రాకూడదని సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇండియాలో కూడా మార్చి 22వ తారీఖున ఎవరు కూడా బయటికి రాకూడదు అంటూ గురువారం మోడీ తన ప్రసంగాన్ని వినిపింప చేశారు. అయితే కరోనా గోల ఎలా ఉన్నా గాని మహారాష్ట్రలో రాజకీయ గోల మాత్రం పలువురిని రంజింప చేసింది. మధ్యప్రదేశ్ లో ముఖ్య మంత్రి కమల్ నాథ్ రాజీనామాతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఎప్పుడెప్పుడా అని అధికారం కోసం ఎదురు చూస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయింది.

 

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నిజానికి, ఈ సంక్షోభానికి కారణం భారతీయ జనతా పార్టీనే. బీజేపీ కనుసన్నల్లోనే మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తెరపైకొచ్చింది. వ్యవహారం సుప్రీంకోర్టుదాకా వెళ్ళింది. ప్రభుత్వం పడిపోకుండా శతవిధాల ప్రయత్నాలు చేస్తూ నిలబెట్టుకోవడానికి కమల్ నాథ్ చెయ్యని ప్రయత్నం లేదు.

 

కాని చివరాకరికి పరిస్థితులు ఒత్తిడి ఎక్కువవడంతో పార్టీలో మాట వినే నాయకులే లేకపోవడంతో ఫైనల్ గా ఆయన చేతులెత్తేయాల్సి వచ్చింది. ఒకపక్క వైరస్ ఉన్న కొద్దీ విజృంభించుకుంటూ ఉంటున్న ఈ తరుణంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన రాజకీయ నాయకులు ఈ విధంగా తమ సొంత రాజకీయాలు చూసుకోవడం వల్ల దేశ ప్రజలు అసహనం చెందుతున్నారు. ఈ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే సెటైర్లు వేస్తున్నారు. ఈ రాజకీయ కరోనా గోల ఏంటయ్యా అంటూ కామెంట్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: