ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావాలని ఉద్దేశపూర్వకంగా ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్యాన్సిల్ చేయించినట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. చంద్రబాబు సామాజిక వర్గం నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజిక వర్గం ఒకటే కాబట్టి ఈ విధంగా వ్యవహరించినట్లు వైసీపీ నేతలు ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసినట్లు ఏపీ రాజకీయాల్లో మరియు మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

 

అయితే ఆ లెటర్ గురించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటువంటి తరుణంలో కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి లెటర్ పై స్పందించారు. ఆయన ఏమన్నారంటే” లెటర్ వచ్చింది, మా దాక వచ్చింది, మేము భద్రత కల్పిస్తాం మా హోం సెక్రటరీ అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ తో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాదులో ఉన్నారు. సెక్యూరిటీ ఉంది ఇప్పుడు. ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళినా కూడా, పూర్తీ స్థాయి సెక్యూరిటీ ఇవ్వాలని, చీఫ్ సెక్రటరీకి ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాము.

 

అవసరమైతే మేమే ఒక లెటర్ ఏపీ ప్రభుత్వానికి రాశి ఆదేశాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయినా కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారిని బెదిరించడం అనేది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. నాకు తెలిసినంతవరకు నిమ్మగడ్డ రమేష్ లెటర్ రాశారు...అనే విషయాన్ని ఎవరూ బయటకు చెప్పలేదు అని కిషన్ రెడ్డి తన సొంత అభిప్రాయాన్ని తెలిపారు. ఈ మాటల్ని బట్టి చూస్తుంటే కిషన్ రెడ్డి వెనక నుండి కథ నడిపిస్తున్న అనుమానం వైసీపీ వర్గాల్లో స్టార్ట్ అయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: