భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల తర్వాత ఎక్కువగా చనిపోయేది షుగర్ వ్యాధిగ్రస్తులే. డయాబెటిస్/ షుగర్ వ్యాధి అనేది జన్యుపరమైన జబ్బు గా వైద్యులు చెబుతుంటారు. అలాగే ఒబేసిటీ/ఊబకాయం లాంటి అనారోగ్య సమస్యల కారణంగా 40 ఏళ్ల దాటిన వారికి షుగర్ వ్యాధి వస్తుంది. ప్రస్తుత జీవన విధానం ఆహారపు అలవాట్లు కూడా డయాబెటిస్ కి దారితీస్తున్నాయి. ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే ఇక అది నయం అవ్వడం దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలన్ననిటితో పోల్చుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఎక్కువ మంది ఉన్నారట.



ఇకపోతే చిన్నపిల్లలకి కూడా టైప్-1 అనే ఒక రకమైన డయాబెటిస్ వస్తుంది. 15 ఏళ్ల లోపు పిల్లలకు టైప్-1 డయాబెటిస్ రాగా... దానికి మూల కారణం ఏంటో ఇంత వరకు తెలియరాలేదు. ఈ డయాబెటిస్ వలన పిల్లలలోని రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. పిల్లలకు ఇన్సులిన్ ఇంజక్షన్ తప్పకుండా ఇవ్వాలి. డయాబెటిస్ వ్యాధి వచ్చిన పిల్లలలో అధికంగా దాహం వేయడం, అధికంగా మలవిసర్జన జరగడం, కడుపు నొప్పి, దృష్టిలోపం శ్వాస సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. అలాగే వారు నిద్రిస్తున్న సమయంలో మూత్ర విసర్జన తరచూ జరగడం, టైర్డ్ అయిపోవడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనబడతాయి.



జన్యుపరంగా లేకపోతే పర్యావరణపరంగా ఒకటి నుండి రెండు ఏళ్ళ పిల్లలకు టైప్-1 డయాబెటిస్ వస్తుంది. చిన్నపిల్లల్లో శారీరక శ్రమ లేక పోతే వారికి కచ్చితంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పరిగెత్తడం, బాస్కెట్ బాల్ టెన్నిస్, షటిల్ వంటి ఆటలు ఆడేలాగా పిల్లలను తల్లిదండ్రులు ప్రేరేపించాలి. ఉదయం పూట సాయంత్రం పూట ఆటలు ఆడటం ద్వారా వారికి ఎటువంటి రోగాలు దరిచేరవు. దురదృష్టవశాత్తు ఒకవేళ మీ పిల్లలకు డయాబెటిస్ ఉందని తేలితే... వారిని మీరు మానసికంగా బలోపేతం చేయాలి. వారికి అండగా నిలుస్తూ ప్రతి నిమిషము అన్ని విధాలా సాయం చేస్తే వారి వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో చిన్నపిల్లలు బద్దకమైన జీవితాన్ని గడుపుతున్నారు. అది ఎంత మాత్రము సరికాదని చెప్పే బాధ్యత పెద్దలకు ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: