దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 271కు చేరింది. ప్రపంచ దేశాలు కరోనా పేరు వినబడితే భయభ్రాంతులకు గురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. అందరికీ శాపంగా మారిన కరోనా ఒక వ్యక్తికి మాత్రం వరంలా మారింది. 
 
మతిమరుపు వల్ల కుటుంబానికి దూరమైన ఒక వ్యక్తి 30 సంవత్సరాల తర్వాత కరోనా వల్ల అతని కుటుంబ సభ్యులను కలవనున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. చైనాలోని చిషు గ్రామానికి చెందిన 57 ఏళ్ల జియామింగ్ 1991లో ఉపాధి పనుల కొరకు హుబాయిఫ్రావిన్స్ కు వెళ్లి అక్కడ మెదడుకు దెబ్బ తగలడంతో గతం మరిచిపోయాడు. ఆ తర్వాత ఒక కుటుంబం అతడిని చేరదీసి ఆశ్రయం ఇచ్చింది. 
 
ఆ తర్వాత అతడు ఎంతో ప్రయత్నించినా గతం మాత్రం గుర్తుకు రాలేదు. ఆ తర్వాత కాలంలో జిమాంగ్ కుటుంబం అతని స్వగ్రామానికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాలో కరోనా వైరస్ భారీన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరగడంతో అక్కడి ప్రభుత్వం వార్తల్లో దేశంలో ఎక్కడెక్కడ మరణాలు చోటు చేసుకున్నాయో వివరాలతో సహా తెలియజేసింది. 
 
వార్తల్లో జియామింగ్ స్వగ్రామం చిషులో ఒకరు చనిపోయినట్లు వార్త వచ్చింది. గతం, కుటుంబం గురించి వార్తలు రావడం జియామింగ్ వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాడు. పోలీసులు అతడి తల్లితో జియామింగ్ ను వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. జియామింగ్ ఆచూకీ తెలియడంతో అతని కుటుంబసభ్యులు సంతోషంతో ఉన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది.            

మరింత సమాచారం తెలుసుకోండి: