ప్రపంచ దేశాలు ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడి పోయే పరిస్థితి వచ్చింది. దీనితో ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా దాదాపుగా  దెబ్బతిన్నట్టు  కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉండే భారత్ లో  కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

 

 కరోనా వైరస్ తీవ్రత ప్రభావం ఇప్పుడు కనబడదని, మరో రెండు మూడు నెలల్లో ప్రజలు ఆహారం కోసం కొట్టుకునే పరిస్థితి వస్తుంది అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఉల్లిపాయల మీద ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మహారాష్ట్రలో ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు. అక్కడ కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు ఆ ఎగుమతులపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యం లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కు మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలను నిషేధించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 

 

అక్కడి నుంచి ఎక్కువగా ఉల్లి ఎగుమతి అవుతుంది. కాబట్టి కరోనా ప్రభావం ఉన్నన్ని రోజులు కూడా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నాలుగైదు నెలల క్రితం ఉల్లి ధరలు ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కరోన  పుణ్యమా అని ఉల్లి ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సరిహద్దులను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కెసిఆర్ అన్నారు. దీనితో ఉల్లి ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: