భారత దేశంలో ప్రజలు అత్యధికంగా ఏ ఏ మార్గాలలో ప్రయాణిస్తారు అంటే... అందులో ముందుగా ఎవరన్నా రైలు మార్గమనే చెబుతారు. ఎందుకంటే.. ధర తక్కువ, పైగా సౌకర్యవంతం కూడాను. సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ రవాణా మార్గంలోనే మాక్సిమమ్ ప్రజలు ప్రయాణిస్తూ వుంటారు. కానీ కరోనా వైరస్ పుణ్యమాని.. రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ కరోనా వైరస్ వలన ఎయిర్ లైన్స్ మాత్రమే కాదు... రైల్వే వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపింది.

 

ఇప్పటికే, చాలా రైళ్లు రద్దు కావడంతో రైల్వే శాఖ వారం రోజుల్లో దాదాపు రూ. 450 కోట్లకు పైగా నష్టపోయిందని భోగట్టా. ఈ తరుణంలో భారతీయ రైల్వే, సుమారు 155 రైళ్లను రద్దు చేసింది. ఇటీవల  మనదగ్గర Covid -19 పాజిటివ్ కేసులను కలిగి ఉన్న రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నందున రైళ్లను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే సీనియర్ అధికారి పేర్కొన్నారు.

 

దేశంలో ఇటీవల 15 కొత్త పాజిటివ్ కేసులు ఒక్కసారిగా నమోదు కావడంతో దేశం మొత్తం అప్రమత్తం అయింది. ఈ పరిస్థితుల్లో రైళ్ల రద్దు అనివార్యమైనట్లు సదరు రైల్వే అధికారి పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనివార్యమని ఆయన మీడియా సమక్షంలో సూచించారు. ఇక ఈ రైళ్లకు క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేయబడవని, వంద శాతం మొత్తాన్ని ప్రయాణికుల అకౌంట్ కు తిరిగి చెల్లిస్తామని రైల్వే అధికారి స్పష్టం చేసారు. 

 

దేశ ప్రధాన మార్గాల్లో దాదాపు 85 రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వే ప్రకటించడం గమనార్హం. రద్దీను కంట్రోల్ చేసేందుకు, జన సమూహాలను నిరోధించేందుకు రైల్వే తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని అందరూ ఆహ్వానించాలి. ఆక్యుపెన్సీ కారణంగా... ఈ నెల 17న ఇంచుమించు 99 రైళ్లు రద్దు చేసినట్టు భోగట్టా. ప్రస్తుతం రద్దు చేసిన రైళ్ల సంఖ్య 155కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: