ఏపీ సీడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయడానికి ఒక గ్యాంగ్ కుట్ర పన్నింది. కడప జిల్లా చిన్న చౌక్ పోలీసులు రంగంలోకి దిగి కుట్రను భగ్నం చేశారు. నిందితులు ఇప్పటికే ఆయనను హత్య చేసేందుకు రెండుసార్లు రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిందితుల నుంచి 3.20 లక్షల రూపాయలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితులలో ఒకడు సూడో నక్సలైట్ అని ... అతని పేరు సంజీవ రెడ్డి అని పోలీసులు తెలిపారు. డీఎస్పీ మీడియాతో గతంలో నిందుతులపై పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిందితులు ముగ్గురు కర్నూలుకు చెందినవారని సుబ్బారెడ్డిని చంపేందుకు డీల్ కుదుర్చుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ రాత్రి 3 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లో 
నిందితులు సుబ్బారెడ్డిని చంపటానికి ప్రయత్నించారని... హైదరాబాద్ పోలీసుల వాహనం సౌండ్ వస్తే అక్కడినుండి వెళ్లిపోయారని అన్నారు. 
 
మరోసారి నిందితులు చంపటానికి ప్లాన్ చేస్తే సమాచారం అందటంతో కుట్రను భగ్నం చేసి నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. పోలీసులు కడప జిల్లా బైపాస్ రోడ్డులో ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర పోలీసులు ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. 
 
ఈ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు....? సుబ్బారెడ్డి హత్యకు ఎందుకు కుట్ర పన్నారు...? ఇతర విషయాలపై పోలీసులు నిందితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీడీపీ ముఖ్య నేత హత్యకు నిందితులు కుట్ర చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: