కరణం బలరాం...మొన్నటివరకు టీడీపీ సీనియర్ నేత. కానీ ఇప్పుడు జగన్ సపోర్టర్. అంటే జగన్ సపోర్టర్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఆయన అధికారికంగా వైసీపీలో చేరలేదు. ఎమ్మెల్యే పదవి పోకుండా ఉండేందుకు పరోక్షంగా జగన్‌కు మద్ధతు తెలుపుతున్నారు. అందుకే కరణం వైసీపీ కండువా కప్పుకోలేదు. అయితే ఆయన తనయుడు వెంకటేష్ మాత్రం వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

 

అయితే కరణం వైసీపీ వైపు వెళ్ళగానే, ఆయనకున్న సపోర్ట్ నిదానంగా తగ్గుతూ...వస్తున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దాల పాటు టీడీపీలో కీలకంగా ఉన్న కరణం బలరాంకు కేవలం ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఫాలోయింగ్ ఉంది. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రతి టీడీపీ కార్యకర్త ఆయన్ని అభిమానిస్తారు. ఇలా టీడీపీలో ఎనలేని అభిమానం సంపాదించుకున్న కరణం, వైసీపీ వైపు వెళ్ళడం వల్ల ఒక్కసారిగా ఆ అభిమానాన్ని కోల్పోయారు.

 

అటు ఆయన కుమారుడు వెంకటేష్ కూడా తన ఫాలోయింగ్ పోగొట్టుకున్నారు. వీరితో పాటు చీరాల, అద్దంకి నియోజకవర్గాల్లో ఉన్న కొందరు అనుచరులు మాత్రమే వైసీపీలోకి వచ్చారు. ఇక వారు తప్ప టీడీపీతో పాటు, కరణం ఫ్యామిలీని అభిమానించే ప్రకాశం జిల్లాలోని కార్యకర్తలు వైసీపీలోకి వెళ్లలేదు. వారు టీడీపీ కంటే కరణం ఫ్యామిలీ ఎక్కువ కాదని అనుకుంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కరణం ఫ్యామిలీని అభిమానించే టీడీపీ కార్యకర్తల మద్ధతు కూడా కోల్పోయారు.

 

ఇటు వారి సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఫాలోవర్స్ తగ్గుతూ వస్తున్నారు. అయితే టీడీపీ కార్యకర్తల ఫాలోయింగ్ తగ్గితే, వైసీపీ కార్యకర్తల ఫాలోయింగ్ ఏమన్నా పెరిగిందంటే, పెద్దగా లేదనే చెప్పొచ్చు. ఏదో కొంతమంది మాత్రమే కరణం రాకని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా చీరాల వైసీపీ కార్యకర్తలు కరణం అంటే గుర్రుగానే ఉన్నారు. ఈయన వల్ల తమ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని భయపడుతున్నారు. మొత్తానికైతే వైసీపీలోకి వెళ్ళాక కరణంకు సపోర్ట్ తగ్గుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: