రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో రిటైర్డ్ అయిన డాక్టర్లకు, నర్సులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం వారిని కాంట్రాక్టు పద్దతిలో విధుల్లోకి తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రానున్న మూడు నెలల కోసం వారిని నియమించుకోనుంది. 
 
రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయాలను అమలు చేస్తోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కు చేరిన విషయం తెలిసిందే. కరోనా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం... డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రభుత్వం మ్యాన్ పవర్ పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రభుత్వం ముందుచూపుతో గత ఐదేళ్లలో రిటైర్డ్ అయిన డాక్టర్లు, నర్సుల సేవలను  వినియోగించుకోనుంది. రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లో వైద్యుల సంఖ్య పెంచటం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం కొత్త వైద్యులను నియమించుకోవాలనుకున్నా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. వైద్య శాఖ అధికారుల సూచనల మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 
 
రోజురోజుకు కరోనా అనుమానితుల సంఖ్య పెరగటంతో రిటైర్డ్ అయిన డాక్టర్లు, నర్సుల సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుంది. మూడు నెలలకు కాంట్రాక్టు పద్దతిలో వారి సేవలను వినియోగించుకుని ఆ తర్వాత అవసరాల మేరకు వారిని కొనసాగించాలని లేదా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు గత ఐదేళ్లలో రిటైర్డ్ అయిన వారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: