యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇప్పటికీ 140 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు వ్యక్తులు కోవిడ్ 19 వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయారు. అయితే ప్రతి ఒక్క దేశంలో లాగానే అక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగం కరోనా వ్యాధి నివారణకు అనేక చర్యలు చేపట్టింది. బహిరంగ గుంపులు నిషేధిస్తూ సినిమా థియేటర్లను, షాపింగ్ మాల్స్ లను మూసివేసింది. ఐతే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎమిరేట్స్ కి చెందిన ఒక వ్యక్తి యొక్క తండ్రి చనిపోయారు. అయితే అక్కడ విధించిన ఆంక్షల వలన బంధువులు మృతుడిని చివరి చూపు కూడా చూసుకోకుండా అయిపోయింది.




కరోనా వ్యాప్తి పెరగకుండా అంత్యక్రియల కార్యక్రమాలలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గర బంధువులు తప్ప మిగతా ఎవరు పాల్గొనకూడదని అక్కడ విధించిన ఆంక్షల వలన తన తండ్రి చనిపోతే ఏడవడానికి పట్టుమని పదిమంది కూడా రాలేకపోయారని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చాడు మృతుడి కొడుకు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.




వివరాలు తెలుసుకుంటే... అహ్మద్ అలీ బిన్ షామిల్ అల్ కాబి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మొన్న చనిపోయాడు. దాంతో మార్చి 20వ తేదీన కుటుంబ సభ్యులు ఆ పెద్దాయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అలాగే మృతుడి కుటుంబ సభ్యులు తమ బంధువులకు సమాచారం అందచేయగా... వారు అక్కడి ప్రభుత్వ రూల్స్ ని ఉల్లంఘించలేక అంత్యక్రియలకు హాజరు కాలేదు. దాంతో ఆ కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదానికి గురయ్యారు. తన తండ్రి మరణిస్తే పట్టుమని పదిమంది కూడా ప్రార్థనలు చేయడానికి రాలేదని, ఒక అనాధ శవంలా గా తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని, తన బంధుమిత్రులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారని, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మృతుడి కొడుకు చెబుతున్న ఓ యాభై ఐదు సెకండ్ల వీడియో ప్రస్తుతం అందర్నీ కలిచివేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: