విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ క్వారంటైన్ పాటించకపోతే మహానగరవాసులకు కరోనా ముప్పు తప్పదా ? అంటే అవుననే వైద్యులు చెబుతున్నారు . ఇప్పటి వరకు తెలంగాణ లో నమోదయిన కరోనా పాజిటివ్ బాధితులంతా  విదేశాల నుంచి వచ్చినవారే  కావడం విశేషం .  దాంతో విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ క్వారంటైన్ పాటించాలని నిపుణులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు . తెలంగాణ లో తాజాగా ఒక గృహిణికి కరోనా వ్యాధి సోకినట్లు తేలింది . దాంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు .

 

 సదరు మహిళ సోదరుడు ఇటీవల విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది . అయితే అతనికి కరోనా వ్యాధి సోకిందా ? లేదా ?? అన్నాదింక నిర్ధారణ కాలేదు . ఒకవేళ అతనికి కరోనా వ్యాధి ఉండడం వల్లే ఆమె కు సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు . విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ముందుగా తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు . విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు ముందుగానే తమ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని స్వీయ క్వారంటైన్ పాటించి ఉంటే ఈ ఇబ్బందులు తలెత్తివి కావని అంటున్నారు .

 

విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటే , కరోనా వైరస్ ను అడ్డుకోవడం పెద్ద సమస్యేమీ కాదని చెబుతున్నారు . అదే సమయం లో నిర్లక్ష్యం చేస్తే మాత్రం తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు . కరోనా వ్యాధి సోకిన వ్యక్తుల వల్ల, ఈ వ్యాధి ఎంత మందికి సోకిందో గుర్తించడం తరువాత కష్టంగా  మారుతుందని వెల్లడించారు . విదేశాల నుంచి ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకున్న వారు స్వీయ క్వారంటైన్ పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: