కరోనా పుణ్యమా అని ఎవరికైన షేక్ హ్యాండ్లూ ఇవ్వాలన్న.. ఎవరినైనా హాగ్ చేసుకోవాలన్న ప్రజలు వణికిపోతున్నారు అంటే నమ్మండి. అలాంటి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. మన భారత దేశంలోకి ప్రవేశించి ఈ కరోనా వైరస్ ప్రజలను వణికిస్తోంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాపించడం సమయంలో ప్రముఖ బాక్సర్‌ మేరీ కోమ్‌ నిబంధనలు ఉల్లంఘించి క్వారంటైన్‌ నుండి బయటకు వచ్చారు అని వార్తలు వచ్చి హాల్ చల్ చేశాయి. జోర్డాన్‌లోని అమ్మన్‌లో జరిగిన ఆసియా- ఓషనియా ఒలంపిక్‌ క్వాలిఫైయర్స్‌లో పాల్గొన్న ఆమె ఇటీవలే భారత్‌ చేరుకున్నారు. అయితే ఆమె 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన నిబంధనను ఉల్లంఘించింది అని విమర్శలు వచ్చాయి.. 

 

అంతేకాదు.. ఈ నెల 13న స్వదేశానికి చేరిన మేరీ కోమ్.. మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. అంతేకాదు.. రాష్ట్రపతి భవన్‌లో ఆమె ఎంపీ దుష్యంత్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చారన్న ప్రచారం జోరు జరిగింది. దీనిపై ఆమె ఈరోజు స్పందించారు. 

 

ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ''జోర్డాన్‌ నుండి  వచ్చిన నాటి నుంచి ఆమె ఇంట్లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మాత్రమే హాజరయినట్టు.. బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ను ఆమె కలవలేదని తెలిపారు. ఆమె క్వారంటైన్‌ ముగిసిందని... అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మరో మూడు నుంచి నాలుగు రోజులు ఇంట్లోనే ఉండటానికి ఆమెకి ఏలాంటి అభ్యంతరం లేదని ఆమె చెప్పుకొచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: