ప్రస్తుతం కరోనా  వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఎంతోమందిని ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా  వైరస్ ప్రభావం ఎంతగానో ఉంది. ఇకపోతే ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు సాగుతూ ఉంటారు . ముఖ్యంగా రాజకీయ పార్టీలకు కావాల్సింది కూడా ఇలాంటి లక్షణమే . అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ఏదో ఒక విధంగా సర్వీస్ చేయాలని బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. 

 

 ఇక చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఫండ్ ఇచ్చే ఎన్నారైలు కూడా చాలామంది ఉంటారు. ఉత్తరాఖండ్ లో  భూకంపాలు సంభవించిన సందర్భంలో.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తో పోటీపడి మరీ చాలామందిని ఆదుకున్న చరిత్ర ఉన్నది. ఇక తాజాగా రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా టిడిపి కార్యకర్తలు అందరికీ జనతా గ్యారేజీ పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కరోనా  వైరస్ నియంత్రించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లే వారందరికీ ధర్మల్  స్క్రీనింగ్ చేస్తున్నారు. 

 


 అయితే చంద్రబాబు నాయుడు కూడా కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కొన్ని రోజుల పాటు పార్టీ కార్యాలయానికి రానని.. పార్టీ నేతలు  కార్యాలయానికి రావొద్దు అంటూ సూచించారు. ఏదైనా మాట్లాడాల్సి  ఉంటే సోషల్ మీడియాలో ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరోనా  వైరస్ ను కంట్రోల్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు బాధ్యతాయుతంగా ఉందాము  అంటూ టీడీపీ నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మిగతా పార్టీలకు కూడా సూచనలా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: