ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  భయం పట్టుకున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు చైనా దేశానికి మాత్రమే పరిమితమైన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు సైతం శరవేగంగా విస్తరిస్తూ ఉండడంతో... ఈ మహమ్మారి భయంతోనే బతుకుతున్నారు జనాలు . అయితే ప్రాణాలు తీయడం కాదు చాలామంది ఒకేచోట ఉండడానికి ఉపయోగపడింది. అయితే తమ కుటుంబానికి సమయం కేటాయించని  చాలా మంది ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం ద్వారా ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. కొంతమంది కరోనా  ఎఫెక్ట్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. 

 


 ఈ క్రమంలోనే కరోనా వైరస్  ప్రస్తుతం ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఉపయోగ పడింది అనే చెప్పాలి. కరోనా  వైరస్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడడం ఏంటి... కరోనా  వైరస్  ద్వారా ఎన్నికలు వాయిదా పడి నిరాశ చెందారు కదా అంటారా..  అయితే కరోనా వైరస్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఎలా ఉపయోగ పడింది అంటే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నేపథ్యంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది.

 


 ముఖ్యమంత్రి హోదాలో ఉండి సిబిఐ కోర్టు విచారణకు హాజరు కాస్త కష్టమైన పని అని తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ సీబీఐ కోర్టులో జగన్  ఎన్నిసార్లు విన్నవించినా... జగన్ వేసిన పిటిషన్ను కొట్టివేసింది  సీబీఐ కోర్టు. కానీ ప్రస్తుతం కరోనా  కనికరించడం ద్వారా... ఏకంగా ఏప్రిల్ 9 వరకు జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను వాయిదా వేసింది కోర్టు. దీంతో ఏకంగా కరోనా  వైరస్ ద్వారా ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సిన  జగన్ కు  రెండు వారాల పాటు విచారణ వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: