కరోనా వైరస్... ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఎన్నో వేలమంది ఈ కరోనా వైరస్ కారణంగా మరణించారు.. ఎన్నో లక్షలమంది ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇక చైనా.. ఇటలీ.. ఇరాన్ వంటి దేశాల్లో అయితే ప్రజలు మరి దారుణంగా మరణిస్తున్నారు.. ఇంకా ఈ తరహాలనో మన భారత్ లోకి ప్రవేశించిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను అతలాకుతలం చేస్తుంది. 

 

కరోనా వైరస్ కారణంగా ప్రజల అంత భయాందోళనకు గురవుతున్నారు. ప్రజల అంత అప్రమత్తంగా ఉన్నారు.. ఈ కరోనా వైరస్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంతే కాదు ఈ కరోనా వైరస్ రాకుండా కేంద్ర ప్రభుత్వం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. 

 

అదే జనతా కర్ఫ్యూ.. ఈ కర్ఫ్యూ లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరు కూడా బయటకు రారు.. ప్రజలంతా కూడా ఇళ్లలోనే బందీలుగా ఉంటారు.. దేశాన్ని రక్షించుకోడానికి.. ప్రాణాలను రక్షించుకోడానికి ఈ జనతా కర్ఫ్యూను విధించారు అంటే నమ్మండి. అలాంటి ఈ కర్ఫ్యూ విధించిన ఈ సమయంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.. 

 

ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో మరి దారుణంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. తెలంగాణాలో ఇప్పటికే 21 కేసులు నమోదు కాగా.. ఏపీలో ఈ ఒక్క రోజే మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు ఉండగా ఇప్పుడు మరో మూడు కేసులు నమోదు అయ్యాయి.. విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాలో ఈ కరోనా పాజిటివ్ వైద్యులు నిర్దారించారు. దీంతో ఏపీలో కరోనా వైరస్ సంఖ్య 5 కు చేరింది. ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.                            

మరింత సమాచారం తెలుసుకోండి: