భారత దేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా  వైరస్ ఎఫెక్ట్ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇక ఈ వైరస్ కు  సరైన వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో ప్రజలు అందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇకపోతే రోజురోజుకు కరోనా వైరస్ భారత దేశంలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ సంకల్పంతో కరోనా వైరస్ పోరాటానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. 

 

 

 ఈ క్రమంలోనే మార్చి 22 ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిర్వహించాలని భారత దేశంలోని ప్రజలందరికీ పిలుపునిచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.  ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా.. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ కి  మద్దతు ప్రకటించి అందరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అంటూ సూచిస్తున్నారు. ఇక తాజాగా దీనికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక ప్రకటన విడుదల చేశారు. కరోనా  వైరస్ కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆదివారం పూర్తిగా తన ఇంట్లోనే ఉండనున్నట్లు ఆయన ప్రకటించారు. 

 

 

 కరోనా వైరస్ ను  నివారించేందుకు రాష్ట్ర ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించి ఇళ్ల  నుంచి బయటకు రావద్దు అంటూ సూచించారు ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప. రేపటి రోజు నేను పూర్తిగా నా ఇంట్లోనే ఉంటాను... ప్రజలకు మంత్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను... నన్ను కలవడానికి ఎవరూ రావద్దు... ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు  రాష్ట్ర ప్రజలంతా పాటించి స్వచ్ఛంద నిర్బంధాన్ని పాటించండి అంటూ కర్ణాటక సీఎం యాదియారప్ప  సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ పిలుపునిచ్చారు. అటు ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ  కు మద్దతు ప్రకటించి తన అభిమానులను కూడా జనతా కర్ఫ్యూ  పాటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: