ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన ఎటువంటి అధికారిని రాజకీయ నాయకులను కదిపినా ఒకే ఒక మాట కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్నారు. ఒక విధంగా ఈ వైరస్ భూమి మీద ఉన్న ప్రజలందరిని ఒక్కతాటిపైకి అనగా భయమనే డేంజర్ జోన్ లోకి తీసుకెళ్ళింది అని చెప్పవచ్చు. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి ప్రస్తుతం భూమి మీద ఉన్న అన్ని దేశాలలో వ్యాపించింది. భారతదేశంలో కూడా ఉన్న కొద్ది దీని ప్రభావం ఎక్కువ అవుతూ వస్తోంది. భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ ప్రభావం గట్టిగా ఉంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ ప్రభావం గట్టిగా కనబడుతోంది. ఇటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను ఇంటికే పరిమితం కావాలని ఎవరు కూడా బయటకు రాకూడదు అని జాగ్రత్తలు మరియు సూచనలు ఇవ్వడం జరిగింది.

 

అయితే సామాన్యులు అంతా బానే ఉన్నా గానీ సెలబ్రిటీలు చేస్తున్న తప్పులు ప్రభుత్వాలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్ళు చేస్తున్న తప్పులు సామాన్యుల జీవితాలను నాశనం చేస్తున్నట్టుగా ప్రస్తుత పరిణామాలు మారాయి. పూర్తి విషయంలోకి వెళ్తే సినిమా షూటింగ్ ల కోసం వివిధ పనుల నిమిత్తం.. విదేశాలకు వెళ్లి వచ్చిన సినీ నటులు.. సినీ రంగానికి చెందిన ఇతరులతో పాటు.. సెలబ్రిటీలు సైతం జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల్లో కలిసి పోతున్నారని, ఇదే సామాన్యులకుపెద్ద తలనొప్పిగా మారిందని వార్తలు వస్తున్నాయి.

 

చాలామంది సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత సరైన ఐసోలేషన్ లో లేకుండా బయటకు వస్తున్నారన్న వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. కొందరు అంతా బాగానే ఉన్నా కానీ కొంత మంది సెలబ్రిటీలు విదేశాల్లో షూటింగ్ ముగించుకుని ఇండియాలో పార్టీలలో ప్రముఖులతో భేటీ అవుతూ వైరస్ వ్యాప్తి చెందడానికి కారకులు అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: