ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. అలా ఇలా కాదు. జనం ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు కరోనా గుప్పిట్లో ఉన్నాయి. అభివృద్ధి చెందిన, చెందని దేశాలు అన్నీ కూడా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. కళ్ళ ముందు చలాకీగా తిరిగిన వాళ్ళు కరోనా వైరస్ తీవ్రతకు కుప్ప కూలిపోతున్నారు. ఆస్పత్రులు ఖాళీ ఉండటం లేదు. ఎక్కడ చూసినా సరే భయంతో కనపడుతున్నారు. హుషారుగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. 

 

ఇది పక్కన పెడితే వ్యాక్సిన్ ఎప్పుడు కనుక్కొంటారు అనేది చెప్పలేని పరిస్థితి. దీనికి మందు లేదు నివారణ ఒకటే మార్గం అని అన్ని దేశాలు చెప్తున్నాయి. ఇప్పట్లో దీనికి మందు కనుక్కొనే పరిస్థితులు మాత్రం ఎక్కడా కనపడటం లేదు. వ్యాక్సిన్ ట్రయల్స్ వేసినా సరే అవి ఫలించడం లేదని అంటున్నారు. దాని రూపం మార్చుకుంటుంది కాబట్టి మందు కనుక్కోవడం అనేది కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ తో విల విలలాడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనాకు మందు కనుక్కోవడం లేదు. 

 

ఈ మందు కనుక్కోవాలి అంటే కనీసం 18 నెలలు పట్టే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనితో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. చల్లగా ఉండే ప్రాంతాలు వెచ్చగా ఉండే ప్రాంతాలు అనే తేడా లేకుండా కరోనా వైరస్ విస్తరిస్తుంది. దీనితో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. వ్యాక్సిన్ కనుగొనే సరికి ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో ఎంత మంది దాని బారిన పడతారో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం భారత్, ఇటలీ. ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా వంటి దేశాలు కరోనా బారిన తీవ్రంగా పడ్డాయి. ఇటలీ లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: