దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వేగంగా విస్తరిస్తూ ఉండటంతో ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావాలని కావాలని కోరారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి. ఈరోజు స్వీయ సంయమనం పాటించడం ద్వారా కరోనా మహమ్మారిని ఎదుర్కోవచ్చు. 
 
జనతా కర్ఫ్యూ అంటే ఎవరికోసమో కాదు. మ‌న కోసం మ‌నం తీసుకునే జాగ్ర‌త్త‌ల్లో కీల‌క ఘ‌ట్టం. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు మ‌న‌పై ఏదో పెద్ద భారం మోపాయ‌ని ఫీల్ కావ‌డం ఈ స‌మ‌యంలో స‌మంజ‌సం కాదు. మ‌న‌కు మ‌నం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌యం ఇది. సో.. జాగ్ర‌త్త‌లు పాటిద్దాం.సాధారణంగా ఒక వైరస్ జీవిత కాలం 12 గంటలు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ చనిపోయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ప్రజలు ఈ ఒక్కరోజు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 
 
ప్రజలు ఇంటికే పరిమితం కావడం వల్ల ఒకరితో ఒకరు కలవకుండా ఉంటారు కాబట్టి వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. అందువల్ల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను ఇంటినుండి బయటకు వెళ్లకూడదు. జనతా కర్ఫ్యూ వల్ల పూర్తిగా వైరస్ వ్యాప్తి ఆగిపొదు కానీ పరిస్థితులు మాత్రం అదుపులోకి వస్తాయి. ప్రజలు సామాజిక దూరం పాటించడం వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. 
 
ఇంట్లో ఉన్నవారు తప్పనిసరిగా వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఇంట్లోని కుటుంబ సభ్యులను దూరంగా ఉంటూనే మన పనులు మనం చేసుకోవాలి. బంధువులను, స్నేహితులను ఇంటికి ఆహ్వానించకూడదు. చేతులను గంటకొకసారి శుభ్రపరచుకోవడంతో పాటు స్వీయనియంత్రణ పాటించాలి. శరీరం రోగనిరోధక శక్తి కోల్పోకుండా ఎక్కువగా పండ్లు తినడం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: