కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కొన్ని సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ఈ మహ‌మ్మారి దేశాన్నే కబళిస్తుంది. ఇటలీ అనుభవం చూశాకైనా జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోకి వచ్చే పాల ప్యాకెట్లను శుభ్రంగా కడిగి మాత్రమే తదుపరి ఉపయోగించండి. సాధ్యమైనంతవరకు న్యూస్ పేపర్లను వచ్చేనెల అంతం వరకు ఉపయోగించకండి.

 


ఒక నెల రోజుల పాటు జొమాటో స్విగ్గి లను సాధ్యమైనంత వరకూ ఊ వినియోగించ కండి.
ఇంటికి తీసుకువచ్చిన కూరగాయలను పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించండి. ఎక్కువగా వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న సెల్ ఫోన్ మరియు రిమోట్ లను కనీసం రోజుకు ఒకసారి క్లీనింగ్ ఫ్లూయిడ్ తో శుభ్రపరచాలి. ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు గానీ కనీసం గంటకు ఒకసారి సబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులను శుభ్రపరుచుకోవాలి.

 

 

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయండి. జిమ్ములను స్విమ్మింగ్ పూల్ ను ఇతర ఎక్ససైజ్ ప్లేస్ ను ప్రైవేట్ లను డాన్స్ క్లాసులను సంగీత క్లాసులను అవాయిడ్ చేయండి. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే మీ బట్టలను తొలగించి దూరంగా ఉంచి కాళ్ళను చేతులను అతి శుభ్రంగా కడుక్కోండి. అతి ముఖ్యమైన విషయం పూర్తిగా చేతులను శుభ్రపరచకుండా మీ ముఖమును అందలి భాగములను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు.
పని మనుషులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను పూర్తిగా చేతులు కాళ్ళు కడుగుకొని తదుపరి పని చేయమని చెప్పండి వారిని మెయిన్ గుమ్మాలు కానీ గోడలు కానీ తాకకుండా ఉండేటట్లు చూడండి. వారికి కూడా శుభ్రత విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వండి.

 

అతి ముఖ్యమైన రెండో స్టేజ్ నుండి మూడో స్టేజ్ కి వెళ్లే పరిస్థితుల్లో మన దేశం ఉంది ఇటలీ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది అంటే మనదేశంలో ఆ పరిస్థితి వస్తే ఎంత దయనీయంగా ఉంటుందో ఆలోచించండి దయచేసి తేలికగా తీసుకోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: