జనతా కర్ఫ్యూ.. దేశంలో బహుశా ఇలాంటి కర్ఫ్యూ గతంలో ఎన్నడూ జరిగి ఉండకపోవచ్చు.. శాంతిభద్రతల కోసమో.. గొడవల నివారణ కోసమో.. కర్ఫ్యూ విధిస్తారు. కానీ ఇలా ఆరోగ్యం కోసం.. వైరస్ వ్యాప్తి నివారణ కోసం కర్ఫ్యూ విధించడం దేశంలో బహుశా ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావచ్చు.. ఏకంగా ఈ దేశ ప్రధాని ఇందుకు పిలుపు ఇచ్చారు.

 

 

ఒక్క రోజు ఇంట్లో ఉంటే కరోనా పోతుందా.. అని ప్రశ్నించే వారూ ఉంటారు. నిజమే.. ఒక్క రోజు కర్ఫ్యూ ఉంటే.. కరోనా ఏమీ దేశం వదిలిపోదు. మరి ఇంకెందుకీ కర్ఫ్యూ అంటారా.. కరోనా వైరస్ వ్యాప్తిలో గొలుసును తెగ్గొట్టేందుకు ఈ కర్ఫ్యూ అవసరం. కరోనా వైరస్ బయట దాదాపు 12 గంటలు బతికి ఉంటుంది. ప్రధాని దాదాపు 14 గంటల పాటు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు.

 

 

దీని వల్ల సమాజంలో అంటే బస్సుల్లో, రైళ్లలో, హోటళ్లలో, పబ్లిక్ ప్లేసుల్లో ఉండే వైరస్ ఈ 14 గంటల పాటు చనిపోతుంది. అంటే దాన్ని వ్యాప్తి గణనీయంగా తగ్గిపోతుంది. ముందు వ్యాప్తిని అరికడితే.. ఆ తర్వాత కరోనాను కట్టడి చేయొచ్చు. అందుకే ఈ కర్ఫ్యూ చాలా ముఖ్యమైన ప్రక్రియ..

 

 

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ కర్ఫ్యూ ద్వారా దాని తీవ్రతపై దేశ మంతా చర్చ జరుగుతుంది. అసలేంటి కరోనా అని జనం ఆలోచిస్తారు. అందుకే కర్ఫ్యూ రోజు సాయంత్రం సైరన్ మోగించగానే.. చప్పట్లు కొడుతూ అందరూ సంఘీభావం ప్రకటించాలి. కరోనాపై పోరాటానికి మనమంతా ఐక్యంగా పోరడతామని చాటి చెప్పాలి. అందుకే క్లాప్ కరోనా... స్టాప్ కరోనా.. ఇదే మన నినాదం కావాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: