ఇటీవ‌లి కంప్యూట‌ర్ కాలంలో మ‌నం ఉద్యోగాలు, బాధ్య‌త‌ల‌తో త‌ల‌మున‌క‌లైపోతున్నాం. దీంతో పిల్ల‌ల‌కు కేటాయించే స‌మ‌యం క‌రువ‌వుతోంది. పిల్ల‌లు ఏం చ‌దువుతున్నారో.. స్కూళ్ల‌లో కాలేజీల్లో వారికి ఏం చెబుతున్నారో.. వారే పుస్తకాలు చ‌దువుతున్నారో వంటివి కూడా ప‌ట్టించుకునే తీరిక నిజంగానే తల్లిదండ్రులుగా మ‌నం మిస్స‌యి పోతున్నాం. ఈ జ‌న‌తా క‌ర్ఫ్యూ పుణ్య‌మాని మ‌న‌కు ఒక రోజు రోజంతా ఇంట్లో గ‌డిపే స‌మ‌యం చిక్కింది. ఈ స‌మ‌యంలోవారి పుస్త‌కాల‌ను త‌నిఖీ చేయ‌డంతోపాటు వారు ఎలా చ‌దువుతున్నారో ఓ రెండుగంట‌ల పాటు వారిని ద‌గ్గ‌ర కూర్చోబెట్టుకుని తెలుసుకునే అవ‌కాశం చిక్కింది మిస్స‌యి పోకుండా ఈ రోజంతా వారితో వీల‌యినంత వ‌ర‌కు స‌మ‌యాన్ని గ‌డుపుదాం. అలాగే వారి చ‌దువు పై ఎంత శ్ర‌ద్ధ పెడుతున్నామో వారి పుస్త‌కాలు కూడా నీటిగా ఉన్నాయా లేదా కొంత మంది బుక్స్‌కి క‌వ‌ర్స్ కూడా స‌రిగా ఉంచుకోరు చించుకోవడం లాంటివి చేస్తుంటారు. అలాంట‌ప్పుడు అవి కూడా శుభ్రంగా ఫుల్ క‌వ‌ర్ చేయ‌డం. పుస్త‌కాల‌ను నీటిగా ఉంచుకోవాల‌ని పిల్ల‌ల‌కు చెప్ప‌డం. అలాగే వారిని ఏ విష‌యంలో కూడా బ‌య‌ట‌కు పంపించ‌కుండా జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డం.

 

వారికి ఏం కావాల‌న్నా ఇంట్లోనే వండిపెడుతూ బ‌య‌ట ఫుడ్ తిన‌కుండా చెయ్య‌డం అనేది చాలా ముఖ్యం ఈ ఒక్క‌రోజు అంద‌రూ క‌లిసి ఉంటారు కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కు వారికి నీటిగా ఉండ‌టం ఎలానో మీరు చేసి చూపించ‌డం చాలా మంచిది. ఏదైనా ఆహారం తినే ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా క‌డుక్కుని తిన‌డం. ఏవైనా ముట్టుకున్నా నీటిగా డెట్టాల్ సోప్‌తో చేతులు క‌డుక్కోవ‌డం అలాగే ప్ర‌తిది కూడా శుభ్ర‌ప‌రుచుకోవ‌డం నేర్పిస్తే పిల్ల‌ల‌కు శుభ్రంగా ఉండ‌టం కూడా అలవాట‌వుతుంది. అలాగే ఏదైనా స‌రే ఇంట్లో వండుకుని తినే ఫుడే చాలా బావుంటుంద‌ని అదే ఆరోగ్య‌క‌ర‌మ‌న్న విష‌యం కూడా వారికి అర్ధ‌మ‌య్యేలా చెప్ప‌డం మంచిది. చాలా మంది చిన్న పిల్ల‌లు వారికి బ‌య‌ట ఫుడ్ కావాల‌ని మారాం చేస్తూ ఉంటారు. అప్పుడు వారిని త‌ల్లిదండ్రులు కొట్ట‌డం, తిట్ట‌డం లాంటివి చేస్తుంటారు. అలా కాకుండా వారికి ఈ వ్యాధి తీవ్ర‌త దాని వ‌ల్ల వ‌చ్చే ఇబ్బందులు గురించి నెమ్మ‌దిగా మంచిగా వివ‌రించండి పిల్ల‌లు అర్ధం చేసుకునేలా వారికి అర్ధ‌మ‌య్యేలా చెబితే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: