వైరస్‌ను నిర్మూలించడానికి హెలికాప్టర్ల ద్వారా రసాయనాలు చల్లుతున్నారనేది వట్టి పుకార్లు మాత్రమే. మునిసిపాలిటీ వాళ్లు రాత్రుల్లో క్రిమిసంహారక మందులు చల్లుతున్నారని, ఇది శరీరం పై పడితే వ్యాధులు వస్తాయని చెప్పడం నిజంకాదు. జనతాకర్ఫ్యూను పాటించకుండా బయటకు వస్తే మాత్రం.. ఒకవేళ ఎక్కడైరా కరోనా వైరస్‌ ఉంటే అంటు వ్యాధిలా వ్యాపించే అవకాశం ఉంది. ఇది గంటల వ్యవధిలో వేలాది మందికి పాకే ప్రమాదం ఉంది. అందకే అందరూ ప్రశాంతంగా ఇంట్లో ఉంటే మంచిదని జనతా కర్ఫ్యూను విధించారు.    

 

అందులోనూ ఆదివారం ఈ జ‌న‌తా క‌ర్ఫ్యూని విధించ‌డానికి ముఖ్య కార‌ణం పిల్ల‌ల‌కు స్కూళ్ళు సెల‌వులు ఇచ్చారు. కానీ చాలా చోట్ల ప‌నిచేసే కార్యాలయాల‌కు మాత్రం సెల‌వులేదు. అలాగే రెక్కాడితేగాని డొక్కాడ‌ని కొన్ని రోజువారి పనులకు మాత్రం సెల‌వనేది లేకుండా ప‌ని చేస్తున్నారు. ప‌ని చేస్తేనే క‌డుపు నిండా మూడు పూట్ల భోజ‌నం ల‌భిస్తుంది అలాంటి నిరుపేద‌ల‌కు క‌ష్ట‌ప‌డ‌టం త‌ప్ప వేరే మార్గం ఉండ‌దు. ఇక చ‌దువుకుని కాస్తో కూస్తో ఉద్యోగం చేసుకునేవారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అంటూ ఇళ్ళ‌లోనించే ప‌ని చేస్తున్నారు. కాని మిగ‌తావారి ప‌రిస్థితి అలా లేదు. అనుకున్నంత తేలిక‌గా లేదు. క‌చ్చితంగా బ‌య‌ట‌కు వెళ్ళాల్సి  వ‌స్తుంది ప‌ని చేసుకోవ‌ల‌సి వ‌స్తుంది. మ‌రి అలాంట‌ప్పుడు న‌లుగురూ నాలుగు ర‌కాల మాట‌లంటారు. ఏవేవో చెబుతుంటారు అవ‌న్నీ విని ద‌య‌చేసి కొత్త కొత్త అపోహ‌ల‌న్నీ తెచ్చుకోకండి. 

 

కేవ‌లం మ‌న శ‌రీర శుభ్ర‌త మ‌నం ఉండే ప‌రిశ‌రాల శుభ్ర‌త అనేది చాలా ముఖ్యం ఇవి శుభ్రంగా ఉంచుకుంటే చాలు మ‌నం ఈ క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పుకున్న‌ట్లే. లేనిపోని అప‌నమ్మ‌కాలతో భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వ‌డం మానేసి ముఖ్యంగా మ‌నం చేయ‌వ‌ల‌సిన‌వి చేస్తే స‌రిపోతుంది. మ‌నం ఉండ‌వ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ కొంచం వీలైనంత వ‌ర‌కు మ‌నిషికి మ‌నిషి తాక‌కుండా కొద్ది రోజుల పాటు జాగ్ర‌త్త వ‌హిస్తే చాలు అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: