ప్రపంచ మొత్తాన్ని వణికిస్తున్న ఈ వైరస్ కి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ వైరస్ మన దేశంలో రెండో దశలో ఉంది. దింతో ప్రపంచ దేశాలని ఇప్పుడు మన దేశంపై ఉత్కంఠతో చూస్తున్నాయి. ఈ జనతా క‌ర్ఫ్యూ విజయవంతం చేయడానికి అందరు సహకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనికి ప్రతికంగా దేశంలో అందరు చెట్లు నాటి క‌ర్ఫ్యూకు గుర్తుగా మలుచుకుందాం కొందరు అభిప్రాయం పడుతున్నారు. 

 

ఇటువంటి తరుణంలో కరోనాను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జనతా కర్ఫ్యూ’ను విధించాయి. దేశ ప్రజలంతా ఆదివారం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలోకి పాల్గొనేందుకు అన్నివిధాలుగా సిద్ధమయ్యారు. కరోనా వైరస్‌ ప్రస్తుతం మనదేశంలో రెండో దశలో ఉంది.

 

మొదటి దశ విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఈ వైరస్‌ బారినపడడం.. రెండో దశలో విదేశాల నుంచి వచ్చినవాళ్లు తిరిగిన ప్రాంతాల్లో వైరస్‌ గాల్లోనే ఉంటుంది. ఈ దశలోనే వైరస్‌ ను అంతం చేయగలిగితే పెద్ద ముప్పు నుంచి తప్పుకున్నట్లే. మూడో దశకు చేరుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది.  

 

గాల్లో ఉన్న వైరస్‌ మనుషుల్లోకి చేరడం.. వాళ్లు తుమ్మినప్పుడు, దగ్గినపుడు, చేతులు కలిపినపుడు అంటువ్యాధిలా అందరికీ వైరస్‌ పాకడం జరగుతుంది. ఫలితంగా నాలుగో దశలో ఊహించని విధంగా ప్రాణ నష్టం జరుగుతుంది. జనతా కర్ఫ్యూ ద్వారా 14 గంటల పాటు ఇంట్లోనే ఉంటే వైరస్‌కు లింకు బంధం తెగిపోతుంది. ఎక్కడికక్కడే అది తుడిచి పెట్టుకునిపోతుంది. 

 

ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లోనే ఒక మొక్క‌నాటి దానికి జ‌న‌తా క‌ర్ఫ్యూకు గుర్తుగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నిద్దాం. కొన్నేళ్ల త‌ర్వాత‌.. అదిగో అప్ప‌ట్లో దేశంలో జ‌న‌తా క‌ర్ఫ్యూ అని ఒక‌రోజంతా ఇంటి నుంచి మేం బ‌య‌ట‌కు రాలేదు. ఆ రోజే నేను దీన్ని నాటాను. ఇప్పుడు ఇది ఎంత పెద్ద‌ద‌యిందో అని ఓ జీవిత కాలం పాటు మ‌న‌కు ఆ మొక్క తీర‌ని జ్ఞాప‌కం మిగుల్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: