రోజూ ఉరుకుల పరుగుల జీవితం. ఇంట్లో వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండదు. కనీసం ఇంట్లో ఉండి పిల్లలతో మాట్లాడే అవకాశం ఉండదు. నా అన్న వాళ్ళను పలకరించే పరిస్థితి ఉండదు. అందరూ ఇంతే. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి నా అన్న వాళ్ళతో మాట్లాడుకుందాం అని చూసినా సరే అది సాధ్యం కాని జీవితం నేడు ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు, విద్య ఇలా అన్ని విధాలుగా మనం మన వాళ్లకు దూరంగా ఉంటున్నాం. ముఖ్యంగా భార్యకు దూరంగా ఉంటున్నాం. ఈ మధ్య గృహ లక్ష్మి అనే సీరియల్ ఒకటి వస్తుంది. ఆ సీరియల్ లో... 

 

ప్రధాన పాత్రలో ఉన్న మహిళ తన భర్త మాట్లాడటం లేదని తన భర్త తనతో సమయం గడపడం లేదని, రోజు వ్యాపారమే అని ఆవేదనగా మాట్లాడుతూ ఉంటుంది. నాతో గడపండి కాసేపు అయినా అని కోరుతుంది. అలా బయటకు చెప్పలేని భార్యలు ఎందరో ఉన్నారు. నీ మానాన నువ్వు వ్యాపారాలు చెసుకుంటావ్ ఉద్యోగాలు చెసుకుంటావ్. మరి ఆమెతో మాట్లాడేది ఎప్పుడు. ఏడు అడుగులు వేశావ్ కదా. మరి మాట్లాడటానికి వచ్చిన ఇబ్బంది ఏంటీ...? అందుకే ఇవాళ జనతా కర్ఫ్యూ. భార్యకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించండి. 

 

మీ భార్య ఇంట్లో ఎంత కష్టపడుతుందో చూడండి. ఇవాళ పని వాళ్లకు కూడా సెలవు కాబట్టి మీ భార్యతో కలిసి ఇంటి పని అంతా పంచుకోండి. సరదా గా ఆమెతో కలిసి చేసుకోండి. అన్ని వండుకోంది తినండి. సరదాగా టీవీ చూడండి. కరోనా పక్కన పెట్టండి. ముందు మీ భార్యతో మీరు సంతోషంగా గడపడానికి మంచి అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని వాడుకోండి. మళ్ళీ రేపటి నుంచి పరుగులే కదా. కాబట్టి ఈ రోజు మీ భార్యతో ఎంజాయ్ చేయండి. పిల్లలు కూడా కాదు. భార్యతో సమయం గడపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: