బ్యాంకు పాస్ బుక్ ఎక్కడ పెట్టాం...? బండి రెండో తాళం ఎక్కడ ఉంది...? టీవీ రిమోట్ లోకి బ్యాటరీలు కొన్నాం కదా...? ఎక్కడ దాచి పెట్టాం...? పాత వాచ్ ఒకటి ఉండాలి.... ఎక్కడ ఉంది. బట్టల బీరువా సర్దుకుందాం అంటేనే కుదరడం లేదు. అసలు ఎలా పడితే అలా ఉంది బీరువా. బండి తుడుచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అసలు కుదరడం లేదు. పాన్ కార్డ్ ఎక్కడ ఉంది...? ఆధార్ ఒరిజినల్ కార్డ్ ఎక్కడ ఉంది...? మనం రోజు వీటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎన్ని విధాలుగా చూసినా ఆ పనులు అసలు అవ్వవు. 

 

ఇవాళ జనతా కర్ఫ్యూ. కరోనా మీద అని మోడీ చెప్పగానే అందరూ ఇళ్ళల్లోనే ఉంటున్నారు. కాబట్టి ఇవాళ ఎలాగూ బయటకు వెళ్లరు. అందుకే ఆధార్ ఒరిజినల్ కార్డు ఎక్కడ ఉందో వెతుక్కోండి. విలువైన కాగితాలు ఎక్కడ దాచుకున్నారో చూడండి. అదే విధంగా... చిన్న చిన్న కనపడని వస్తువులు ఎక్కడ దాచుకున్నారో చూడండి. బండి తుడుచుకోండి. ఏవి ఏవి ఎక్కడ పెట్టుకున్నారో వెతుక్కోండి. అన్ని వెతుక్కుని పెట్టుకోండి. ఇల్లు సర్దుకొంది. హాల్, బెడ్ రూమ్, కిచెన్ ఇలా అన్నీ సర్దుకొంది. అలాగే అనవసరమైన వాటిని తీసేయండి. 

 

హుషారుగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని బయటకు రారు కాబట్టి నీట్ గా పెట్టుకోండి. టీవీ చూడటమే గాని తుడుచుకుని ఎన్ని రోజులు అయి ఉంటది. అసలు కొన్న తర్వాత దాని మొహం చూసిన పాపం ఉందా...? రోజు ల్యాప్టాప్ వాడుకోవడమే గాని దాన్ని తుడుచుకోండి. అలాగే ఎన్నో వస్తువులు దుమ్ము పట్టి ఉంటాయి. రోడ్డు పక్కన ఇల్లు అయితే ప్రతీ వస్తువుకి దుమ్మే ఉంటుంది. కాబట్టి వాటిని నీట్ గా పెట్టుకోవడానికి ఈ రోజు మంచి అవకాశం. మళ్ళీ ఇలాంటి రోజు మీ జీవితంలో రాదు. కాబట్టి అన్ని సర్దుకొండి.

మరింత సమాచారం తెలుసుకోండి: