గత సంవత్సరం డిసెంబర్ నెలలో కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో విజృభించి అతి తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలకు సంక్రమించింది. ఇప్పటివరకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... వేలల్లో ప్రజలు మృత్యువాత పడ్డారు. భారతదేశంలో కూడా 321 పాజిటివ్ కరోనా కేసులు నమోదు కాగా... నలుగురు వ్యక్తులు కోవిడ్ 19 వ్యాధి వలన చనిపోయారు. అయితే ప్రపంచ మహమ్మారిగా అవతరించి ప్రజలందరి ప్రాణాలను తీసేస్తున్న కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు లక్షల మంది శాస్త్రవేత్తలు మందును కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.




ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ని నయం చేసేందుకు ఒక వ్యాక్సిన్ కూడా తయారు చేయబడింది. మన భారతదేశంలో కూడా తలపండిన వైద్య శాస్త్రవేత్తలు కరోనా ని నిర్మూలించేందుకు మందులను కనిపెట్టడానికి నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేవలం ఒకే ఒక టీ తాగితే కరోనా వైరస్ సోకే ప్రమాదమే ఉండదని అస్సాం రాష్ట్రంలో టాక్ వినపడుతోంది.



వివరాలు తెలుసుకుంటే... అస్సాం రాష్ట్రంలో తయారయ్యే ఒక బ్లాక్ టీ లో వైరల్ లక్షణాలని ఎదుర్కొనే అత్యంత సహజమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని... ఇంట్లో కూర్చొని రోగనిరోధక శక్తిని పెంచడానికి... ఆరోగ్యంగా ఉండటానికి ఈ టీ తాగాలని ప్రచారం జరుగుతుంది.




డాక్టర్ ప్రీతమ్ చౌదరి మాట్లాడుతూ... బ్లాక్ టీలో థీఫ్లావిన్ అనే పదార్థం ఉంటుందని అది కోవిడ్ 19 వ్యాధి ని రాకుండా చేయగలదని, అలాగే ఆ బ్లాక్ టీ లో పాలీఫెనాల్స్ అనే పదార్థం కూడా ఉంటుందని... అది కూడా కరోనా వైరస్ నుండి రక్షిస్తుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం గుర్తించి, ఒక్కసారి పరీక్షించాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ అస్సాం బ్లాక్ టీ ని అక్కడ ప్రజలు ప్రతిరోజు తప్పకుండా తాగాలనే ప్రచారం యదేచ్ఛగా జరుగుతుంది. మరి ప్రధానమంత్రి కార్యాలయం ఈ బ్లాక్ టీ ని పరీక్షించి ఏం చెబుతుందో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: