ప్రస్తుత పరిస్దితిలో ప్రజలంతా నిదురకూడ మరచిపోయారు.. రానున్న విపత్తును ఊహించుకుంటూ ఆందోళన పడుతున్నారు.. ఇంతటి ఘనకార్యాన్ని చేసి ఈ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా అనే చిన్న ప్రాణికి ఉన్న శక్తికి భయపడి టెక్నాలజీ కూడా ముసుగేసింది.. ఇన్నాళ్లుగా ఈ సృష్టిలో మనిషికంటే బలమైన, శక్తివంతమైన, వారు లేరని వీగుతున్న మేధావుల ఆలోచనలకు బ్రేక్ వేసింది కరోనా.. ఇప్పుడైనా కళ్లు మూసుకుని అభివృద్ధి అంటూ బ్రేకులు లేకుండా పరిగెత్తుతున్న ఓ మేధావి ఇలాంటి విపత్తులు ముందు ముందు ఎన్నో వస్తాయి..

 

 

ఇప్పుడే ఇలా అతలాకుతలం అవుతుంటే ఇలాంటి ప్రమాదాలు ఊహించనంతగా ఒకే సారి విరుకుపడితే నీ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది.. అప్పుడేం చేస్తావు.. నీ వెంట ఉన్న ఆర్ధిక బలం, అంగబలం అడ్డుపెట్టుకుని బ్రతకాలని చూస్తావా.. అవికూడా నిన్ను కాపాడలేవని ఈ కరోనా నిరూపిస్తుంది.. ఇకపోతే యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వల్ల ఎవరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న చైనా.. ఇప్పుడు ఇటలీలో కరోనా సృష్టిస్తున్న మారణ హోమాన్ని చూసి భారత్ సైతం వణికిపోతుంది. దీంతో భారత ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

 

 

ఇదంతా ప్రజా శ్రేయస్సు కోసమే.. అదేమంటే కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టడి చేసేందుకు నాలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.నేపథ్యంలో మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు తమ సరిహద్దులకు సీలు వేశాయి. ఈ నెల 22 నుంచి మార్చి 31వతేదీ వరకు తమ రాష్ట్రాల సరిహద్దులను మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఆదివారం ప్రకటించాయి. కరోనా వల్ల ఇంకా పరిస్దితులు భయంకరంగా మారకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాయి..

 

 

కాగా అనేకమంది ప్రజలు సరిహద్దులను మూసివేయడంతో, రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా పరిస్దితులు విషమించే సూచనలు కనిపిస్తే మహారాష్ట్ర నుంచి రాకపోకలు బంద్ చేస్తామని ప్రకటించింది... ఇక ఈ కరోనానుండి బయటపడాలంటే ఒక అధికారులు, ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదు.. ప్రజలంతా కూడా ఈ మహాయాగంలో భాగస్వాములు అయితే మాత్రమే పరిస్దితి అదుపులోకి వస్తుంది.. లేదంటే మన రాష్ట్రాలు కూడా మరో ఇటలీలా మారుతాయి.. కాబట్టి ఆలోచించి అడుగేయండని వినతి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: