జ‌న‌తా క‌ర్ఫ్యూ.. ఈ కర్ఫ్యూ ఎందుకు విధించారో ఎక్కడ విధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను అంతం చేసేందుకే ఈ జనతా కర్ఫ్యూ. ఇంకా ఈ జనతా కర్ఫ్యూతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. 

 

ఇకపోతే మన బిజీ లైఫ్.. అంటే ఉదయం 7 గంటలకు లేయడం.. స్నానం చేయడం.. రెడీ అవ్వడం.. టిఫిన్ చెయ్యడం.. 9 గంటల సమయం కు అంత ఇంటికి తలలు వేసి భార్య భర్త పిల్లలు అందరూ ఆఫీసులకు.. స్కూల్స్ కు వెళ్తారు. ఇంకా అందరూ సాయింత్రం 6 గంటలకు ఇంటికి వస్తారు. అందరూ అలసి పోయింటారు.. 

 

ఇంకా ఇంట్లో వంట చేసుకొని.. ఇల్లు కిన్ చేసుకొని... కాసేపు టీవీ చూసి.. భోజనం చేసేసరికి 9 అవుతుంది. ఇంకా గంటకు నిద్రపోతారు. ఇలా కాలం గడిచేది. అలా గడిపే వారందరికీ ఈ కరోనా వైరస్ ఒక వరం అయ్యింది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ కారణంగా పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు.. పెద్దలకు ఇంటి నుండే వర్క్ చేసుకునే సదుపాయం కల్పించారు. 

 

దీంతో అందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు.. అయితే ఆ కంప్యూటర్ ప్రపంచం నుండి ఇప్పుడు బయటకు వచ్చాము. కానీ.. ముందు అయితే పక్కనే ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్ళటం కూడా సూన్యమే.. వాళ్ళను ప‌రామ‌ర్శించే ఓపిక‌, తీరిక మ‌న‌కు ఉండ‌డం లేద‌న్న‌ది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. 

          

ఇంకా ఇప్పుడు జనతా కర్ఫ్యూ కాబట్టి ఈ ఆదివారం అంటే నేడు అత్యంత స‌మీపంగా ఉండే బంధువుల‌కు కేటాయిద్దాం.. వారి ఇంటికి వెళ్లకుండానే వారి యోగక్షేమాలు తెలుసుకునే అవకాశం చేద్దాం.. ఆనందిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: