క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. దీని బారిన ప‌డిన వారి సంఖ్య రోజు రోజుకు విప‌రీతంగా పెరుగుతోంది. మ‌రో వైపు ఈ వైర‌స్ కు ఇట్టే అడ్డుకట్ట వేయ‌వ‌చ్చ‌ని చాలా సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి వీటిలో నిజ‌మెంతో ఇప్పుడు తెలుసుకుందాం. క‌రోనా ఇన్‌ఫెక్ష‌న్ల పై వెల్లుల్లి బాగా ప‌ని చేస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌రిదీని పై ప్ర‌పంచ ఆరోగ్య స‌మ‌స్య ఏమి చెబుతుందంటే నిజానికి వెల్లుల్లిలో బ్యాక్టీరియాని అరిక‌ట్టె కొన్ని ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అంత మాత్రాన అది మ‌న‌ల్ని ఈ వైర‌స్ నుంచి ర‌క్షిస్తుంది అన‌డానికి అయితే మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. ఒక్కోసారి అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డే అవ‌కాశం కూడా ఉంది. ఓ మ‌హిళ కేజీన్న‌ర వెల్లుల్లి తిన‌డం వ‌ల్ల గొంతు ఇన్‌ఫెక్ష‌న్ అయి ఆసుప‌త్రి పాలైంది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ప‌లానా ఆహారం ప‌లానా వైర‌స్‌ను అడ్డుకుంటుంది అని చెప్ప‌డానికి మాత్రం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. 

 

అలాగే వైర‌స్ నుంచి ర‌క్షించుకోవ‌డంలో శానిటైజ‌ర్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే చాలా దేశాల్లో శానిటైజ‌ర్ల‌కు కొర‌త ఏర్ప‌డింది. దీంతో ఇంట్లోనే శానిటైజ‌ర్లు త‌యారు చేసుకునే మూల‌కాల గురించి సోష‌ల్ మీడియాలో చాలా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే వీటిలో చెప్పే చాలా వ‌స్తువులు కేవ‌లం నేల‌ను మాత్రం శుభ్రంచేయ‌డానికి ప‌నికొస్తాయి త‌ప్పించి మ‌న శ‌రీర చ‌ర్మాన్ని కాపాడేందుకు స‌రిప‌డ‌వ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఇంట్లోనే శానిటైజ‌ర్‌ని త‌యారు చేసుకోవ‌డం అనేది చాలా పెద్ద బూట‌కం అంటున్నారు లండ‌న్‌కు చెందిన కొంత మంది వైద్య బృందం.

 

వెండి రేణువుల ద్ర‌వ‌ణం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా క‌రోనాని త‌రిమికొట్ట‌చ్చ‌నే ప్ర‌చారం సాగుతోంది. కొల్లాయిడ‌ల్ సిల్వ‌ర్ అనే ద్రావ‌కాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం 12 గంట‌ల్లోనే ఈ వైర‌స్‌ని ప్రాల‌ద్రోలొచ్చు అంటున్నారు. అయితే ఈ ద్రావ‌ణం తాగ‌డం వ‌ల్ల ఎలాంటి మంచి జ‌ర‌గ‌ద‌ని అమెరికా ఆరోగ్య‌శాఖ స్పంష్టం చేసింది.  అంతేకాక ఆ ద్రావ‌ణాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు విఫ‌లం కావ‌డం చ‌ర్మం నీలంరంగులోకి మార‌డం లాంటివి జ‌రుగుతున్నాయ‌ట‌. ఇక అధికంగా నీరు తాగ‌డం వ‌ల్ల కూడా ఈ వైర‌స్‌ని త‌గ్గించ‌లేము అంటున్నారు. ఇక ఈ ఇన్‌ఫెక్ష‌న్స్ క‌నిపించ‌గానే వైధ్యుల‌ను సూచించ‌డం మంచిద‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: