కరోనా వైరస్ చైనాలో పుట్టిందని తెలుసు.. కానీ ఇప్పుడు ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో పోలిస్తే చైనా చాలా ప్రశాంతంగా ఉంది. కరోనాను కట్టడి చేసింది. మరి ఇంతకీ చైనా ఎలా దీనిపై విజయం సాధించింది. అందుకు ఏ ఏ పద్దతులు అవలంభించింది. కరోనాను కంట్రోల్ చేయడం చైనాకు ఎలా సాధ్యమైంది..? ఓసారి తెలుసుకుందాం..?

 

 

కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరంలోని ఓ మాంసాహార మార్కెట్ లో పుట్టింది. అక్కడి నుంచి నగరానికి పాకింది. అసలు ఇది కరోనా వైరస్ అని గుర్తించి ప్రపంచానికి చాటిన తొలివైద్యుడు కూడా ఆ కరోనాతోనే కన్నుమూశాడు. ఆ తర్వాత చైనా మేలుకొంది. వుహాన్‌ ను లాక్ డౌన్ చేసింది. వేల సంఖ్యలో వైద్యులను వుహాన్ పంపింది. ఆ వైద్య బృందం ఎంత అంకిత భావంతో పని చేసిందంటే.. కుటుంబాలను వదిలేశారు.

 

 

వైద్యులు గంటల తరబడి వైద్యం అందించారు. వారిలో కొందరు కరోనా బారిన పడినా వెనక్కు తగ్గలేదు. సేవలందించే సిబ్బందిలో 3000 మందికి కరోనా రాగా 12 మంది చనిపోయారు కూడా. వుహాన్‌లోని పది ఆస్ప్రత్రులు సరిపోలేదు. అందుకే కేవలం 10 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి కట్టేశారు. స్టేడియాలు, హోటళ్లు, ప్రదర్శన శాలలను క్వారంటైన్లుగా మార్చారు. 10వేల మంది ఆర్మీ వైద్య బృందాన్ని రంగంలోకి దింపారు.

 

 

ఆ తర్వా వుహాన్ నగరాన్ని లాక్ డౌన్ చేశారు. కొందరు వాలంటీర్లుగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సాయం చేశారు. రోజుల తరబడి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. చివరకు ఫిబ్రవరి 17న వుహాన్‌ 100 శాతం నిర్బంధించారు. కమ్యూనిస్టు పాలన కాబట్టి కఠోర క్రమశిక్షణతో కరోనా గొలుసు తెగింది. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం ఆగి.. కేసుల సంఖ్య తగ్గింది. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా వణికిపోతోంటే చైనాలో మాత్రం కొత్త కరోనా కేసుల నమోదు చాలా తక్కువగా ఉంది. దాదాపు నెల రోజులు వూహాన్ ప్రజలు నరకయాతన అనుభవించి కరోనాపై విజయం సాధించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: