జనతా కర్ఫ్యూ... రెండు రోజుల క్రితం ప్రధాని నోటి నుంచి వచ్చిన మాట ఇది. నరేంద్ర మోడీ చెప్పిన వెంటనే ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఒక్క రోజులో కరోనా నయం అవుతుందా అంటూ ఆయన్ను ఎద్దేవా చేసారు. కాని మోడీ ఎందుకు చెప్పారో అర్ధం చేసుకున్న తర్వాత చాలా మంది షాక్ అయ్యారు. కరోనా వైరస్ 12 గంటల వరకు మాత్రం బ్రతుకుతుంది. 14 గంటల పాటు కర్ఫ్యూ పాటిస్తే వైరస్ చనిపోతుందని దాని చైన్ ని బ్రేక్ చేయవచ్చు అని అర్ధమైన తర్వాత అందరూ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అందరూ సమర్ధవంతంగా దాన్ని అమలు చేస్తున్నారు. 

 

ప్రస్తుతం కరోనా వైరస్ మీద యుద్ధం చేస్తున్న భారత్ మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుని సమర్ధవంతంగా అమలు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని ప్రధాన రహదారులు కూడా నిర్మానుష్యంగా మారాయి. పురుగు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇప్పుడు ఇదే ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. మొదటి దశలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఇటలీ అమెరికా దేశాలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేవి అనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. కరోనాను కట్టడి చేయడం అనేది చాలా సులువు నియంత్రణ పాటిస్తే అనే వాళ్ళు ఉన్నారు. 

 

ప్రస్తుతం భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది కాబట్టి జనతా కర్ఫ్యూ ని విజయవంతంగా అమలు చేస్తే మాత్రం కట్టడి చేయడం అనేది చాలా సులువు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. జనతా కర్ఫ్యూ ని విజయవంతంగా మరికొన్ని రోజులు అమలు చేస్తే మాత్రం కరోనాను కట్టడి చేయడం చాలా సులువు. కాబట్టి అందరూ ఈ విషయంలో జాగ్రత్త పదాలని, ముంచుకు వస్తే ఏమీ చేయలేమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: