చైనాలో కరోనా వైరస్ విజృంభించిన దగ్గర నుండి చికెన్ తింటే వైరస్ సోకుతుందని, పెంపుడు జంతువులను నుండి కూడా వైరస్ సంక్రమిస్తుందని కొంతమంది బుద్ధిలేని నీచులు సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు పెంపుడు జంతువులు అనగా శునకాలు, పిల్లులు, పక్షుల వలన కరోనా వైరస్ ఏ మనిషికి సోకలేదు. ఫిబ్రవరి నెలలో హాంకాంగ్ కి చెందిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అయితే ఆ వ్యక్తి కి తన పెంపుడు కుక్క నుండి వైరస్ సోకిందని అనుమానపడిన వైద్యులు దాన్ని క్వారంటైన్ కేంద్రంలో 14 రోజుల నుంచి టెస్ట్ చేశారు. కానీ ఆ కుక్క లో మాత్రం కరోనా వైరస్ ఆనవాళ్లే లేనివి తెలిసింది. ఆ తర్వాత దానిని బయటకు విడిచిపెట్టారు. ఐతే ఆ కుక్క చాలా ముసలిది కావడం వలన... అంటే మనకి వంద సంవత్సరాలు నిండితే ఎలా చనిపోతామో అది కూడా 17ఏళ్లు నిండి సహజ మరణం పొందింది.





ఐతే ఈ వార్తని చాలా మంది తప్పుగా ప్రచారం చేస్తూ.. కరోనా వైరస్ కుక్కల ద్వారా మనుషులకి సోకుతుందని, ఇప్పటికే ఓ కుక్క కరోనా వైరస్ కారణంగా చనిపోయిందని సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారు. దాంతో చాలామంది తెలివితక్కువ వాళ్ళు తమ పెంపుడు జంతువులని నిర్ధాక్షణ్యంగా రోడ్లమీద విడిచి పెట్టడం ప్రారంభించారు. ఇన్ని రోజులు ప్రేమగా చూసుకొని... అకారణంగా వాటిని రోడ్ల మీద విడిచిపెట్టేసరికి అవి ఎటు పోవాలో తెలియక ఆకలితో బాధపడుతూ నరకం అనుభవిస్తున్నాయి. మరికొందరు మాత్రం కుక్కలని పెంచుతున్నందుకు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.





హైదరాబాదులో అయితే... చుట్టుపక్కల వాళ్ళు పొద్దస్తమానం పెంపుడు జంతువుల ని వదిలేయాలని వాటి యజమానులను విపరీతంగా వేధిస్తున్నారట. కుక్కల వలన కరోనా వైరస్ రాదురా, స్వామి!! అని ఎంత నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా వాళ్లు మాత్రం వినిపించుకోకుండా నోరులేని మూగజీవాలను రోడ్డున పడేలా చేస్తున్నారు. ఈ విషయాన్ని కారుణ్య సొసైటీ ఫర్ యానిమల్స్ (CSA) ఫౌండర్ ప్రవళిక మాట్లాడుతూ తెలియజేశారు. తమ సంస్థ కి రోజుకు పది నుండి పదిహేను పెంపుడు కుక్కల యజమానులు కాల్ చేస్తూ... వారి కుక్కలను తమ సంరక్షణలో కొన్ని రోజుల పాటు ఉంచుకోవాలని కోరుతున్నట్లు ప్రవళిక చెప్పారు. అనవసరంగా కుక్కల నుండి మనుషులకి కరోనా వైరస్ సోకుతుందనే అనుమానంతో భయబ్రాంతులకు గురి కావద్దని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: