అవును ఇప్పుడు కరోనా అత్యంత వేగంగా వచ్చేస్తుంది. ఎక్కడిక్కడ కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 350 కి చేరింది. ప్రభుత్వాలు కట్టడి చేస్తున్నా ప్రజల నుంచి సహకారం ఇస్తున్నా ఎక్కడా కూడా వైరస్ మాత్రం అదుపులోకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు అనే చెప్పాలి. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత అంచనా వేసే పరిస్థితి లేదు. మహారాష్ట్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ కరోనా స్టేజి 3 లో ఉందని చెప్పారు. ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వం అంచనా వేయలేని పరిస్థితి లో ఉంది. 

 

ఇక ఇది పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఏపీ లో రెండు కరోనా కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. మొత్తం 5 కేసులు నమోదు కాగా ఒకరు కరోనా కారణంగా మరణించారు అని సమాచారం. దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు. ఇక కర్ణాటక లో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు అక్కడ 40 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

వారిలో కొందరు కోలుకున్నారు మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని ముందుకి వెళ్తే మాత్రం ప్రాణాలు కోల్పోవడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలు అన్ని కూడా కరోనా వైరస్ తో పోరాడటానికి నానా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరమని అంటున్నారు. తక్కువ అంచనా అసలు వేయవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: