ప్ర‌పంచ వ్యాప్తంగా మాన‌వాళిని ముపు తిప్పులు పెడుతూ ప్ర‌పంచ దేశాల‌న్నింటిని హ‌డలెత్తిస్తోన్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు 60 ఏళ్ల పైబ‌డిన వృద్ధుల‌తో పాటు 10 ఏళ్ల లోపు పిల్ల‌ల‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఈ వైర‌స్ సోకిన వారిలో ముఖ్యంగా వృద్ధులు.. పిల్ల‌లు ఈ వైర‌స్ భారీన ప‌డితే చ‌నిపోతున్నారు. మ‌న దేశంలో క‌రోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య ఇప్ప‌టికే 300కు చేరువ అవుతోంది. ఈ క్ర‌మంలోనే నాలుగేళ్ల పిల్ల‌ల‌ను సైతం క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే మ‌న దేశంలో ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.



ఈ లిస్టులోనే అసోం చేరింది. అసోంలో కరోనా పాజిటివ్ తొలి కేసు ఆదివారం నమోదైన‌ట్టు సందేహాలు వ‌స్తున్నాయి. నాలుగున్నరేళ్ల పాపకు వైద్య పరీక్షలో కరోనా పాజిటివ్ అన్న సందేహాలు ఉన్నాయి. అయితే మ‌రోసారి క‌రోనా ఉందా ?  లేదా ? అన్న నిర్దార‌ణ కోసం ఆ పాప శాంపుల్స్‌ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో రీచెకప్ కోసం పంపారు. ఇక ఈ ఫ‌లితాలు సాయంత్రం వెల్ల‌డి కానున్నాయి. ఇందులో సైతం పాజిటివ్ వ‌స్తే మ‌న దేశంలో క‌రోనా సోకిన చిన్న పాప‌గా ఆ పాప నిలుస్తుంది.



ఇక ఈ పాప‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌ను సైతం క్యారంటెన్‌కు పంపారు. అసోంలోని డిస్కూర్ జిల్లా పులిబోర్‌కు చెందిన బాలిక కుటుంబ సభ్యులు ఇటీవల బీహార్ నుంచి రైలులో జోర్హాట్‌లోని మరియానికి వెళ్లారు. ఇక్క‌డ ఏం జ‌రిగిందో తెలియ‌దు గాని.. మొత్తానికి ఆ పాప‌కు క‌రోనా పాజిటివ్ సోకింది. ముందుగా ఆ పాప అస్వ‌స్థ‌త‌కు గురైంది. దీంతో అనుమానంతో క‌రోనా టెస్ట్ చేశారు. ఏదేమైనా క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో పెద్ద‌లు, వృద్ధులు కాకుండా చిన్న పిల్ల‌లు సైతం ఆ మ‌హ‌మ్మారి భారీన ప‌డ‌తార‌ని.. ఇందుకు ఎవ్వ‌రూ మిన‌హా యింపు కాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: