ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల‌ను.. ఎన్నో ప్ర‌భుత్వాల‌ను... కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను హ‌డ‌లెత్తిస్తోన్న క‌రోనా వైర‌స్ భారీన ప‌డి ఎంతో మంది విల‌విల్లాడుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల‌కు సైతం క‌రోనా బూచీ పాకేసింది. ఏపీలో క‌రోనా ఓ మోస్త‌రు కంట్ర‌ల్లోనే ఉంద‌ని చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు కేవ‌లం 5 మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అదే తెలంగాణ‌లో ఈ కౌంట్ ఇప్ప‌టికే 20 దాటేసింది. ప్ర‌ధానంగా హైద‌రాబాద్ మ‌హా న‌గారానికి ఎంతో మంది విదేశీయులు వ‌స్తుండ‌డంతో విదేశాల నుంచి వ‌చ్చిన వారికే క‌రోనా పాజిటివ్ కేసులు వ‌స్తున్నాయి.



తెలంగాణ‌లో ఉన్న వారి కంటే అక్క‌డ విదేశాల నుంచి వ‌చ్చిన వారితోనే ఎక్కువుగా క‌రోనా ముప్పు పొంచి ఉంది. ఇదిలా ఉంటే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం గ‌త ప‌దిహేను రోజుల నుంచే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. కేసీఆర్ ముందు నుంచే క‌రోనా విష‌యంలో పోరాటానికి రెడీ అయ్యారు. ఎక్క‌డిక‌క్క‌డ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. చివ‌ర‌కు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సైతం త‌న కుమార్తె పెళ్లి ప‌నులు వ‌దిలేసి మ‌రీ క‌రోనా విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు అలెర్ట్‌గా ఉన్నారు.



ఇక ఆదివారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పిలుపు మేర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూ విష‌యంలో కూడా కేసీఆర్ స్వ‌యంగా ప్రెస్‌మీట్ పెట్టి మ‌రి అంద‌రూ క‌ర్ఫ్యూ పాటించాల‌ని పిలుపు ఇచ్చారు. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. వాహనాల రొదలేని ప్రశాంత నగరంగా కనపడుతోంది. ఇక హైద‌రాబాద్ పోలీసులు దీనిని స‌క్సెస్ చేసేందుకు ఎంతో శ్ర‌మిస్తున్నారు. విస్తృత ప్ర‌చారం క‌ల్పిచండంతో పాటు ప్లకార్డులు చేతపట్టి .. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరాన్ని పాటించడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.



ఇక చాలా వాహ‌నాల‌ను వెన‌క్కు పంపిం చేస్తున్నారు. అత్య‌వ‌స‌ర వాహ‌నాల‌ను వ‌దిలేస్తున్నారు. డాక్టర్లు, జర్నలిస్టులు, మున్సిపల్ ఇతర సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ విష‌యంలో కేసీఆర్‌కు ప్ర‌తి ఒక్క‌రు జై కొట్ట‌డంతో పాటు జ‌య‌హో హైద‌రాబాద్ పోలీస్ అనాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: