ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిస్తోన్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఆదివారం నాటికి ఏకంగా 12 వేల మందికి పైగా చ‌నిపోయారు. ఇక ఈ వైర‌స్ సోకి ఇప్ప‌టికే 3 ల‌క్ష‌ల మంది బాధితులు అయ్యారు. అస‌లు ఈ క‌రోనా వైర‌స్ అనేది ముందుగా చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ప్రారంభ‌మైంది. ఈ వైర‌స్ కేంద్రంగా పుహాన్ చ‌రిత్ర‌లో నిలిచి పోయింది. అస‌లు వుహాన్‌లో గ‌త రెండు నెల‌లుగా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. అందుకే కరోనాతో ప్రభావితమైన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. 81 వేలకు పైగా కరోనా కేసులు.. 3 వేలకు పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోయింది.



విచిత్రం ఏంటంటే ఎక్క‌డ అయితే క‌రోనా ప్రారంభ‌మైందో ఆ చైనాలో ఇప్పుడు చాలా వ‌ర‌కు కంట్ర‌ల్లోకి వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు క‌రోనా దెబ్బ‌తో ఇరాన్‌, ఇట‌లీ, ఫ్రాన్స్‌, అమెరికా, స్పెయిన్ లాంటి దేశాలు అల్లాడుతున్నాయి. చైనా ప్ర‌భుత్వం చాలా క‌ఠిన త‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో క‌రోనా వైర‌స్ అక్క‌డ కంట్ర‌ల్లోకి వ‌చ్చేసింది. గ‌త రెండు మూడు రోజులుగా చూస్తుంటే అక్క‌డ క‌రోనా కొత్త కేసులు చాలా స్వ‌ల్పంగా మాత్ర‌మే న‌మోదు అవుతున్నాయి. క‌రోనా వైర‌స్‌ను ఏదోలా క‌ట్ట‌డి చేశాం అనుకుంటోన్న చైనాకు ఇప్పుడు మ‌రో కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది.



స్థానికంగా చాలా క‌ఠిన‌మైన నియంత్ర‌ణ ప‌ద్ధ‌తుల ద్వారా ఈ వ్యాధిని కంట్ర‌ల్లోకి తీసుకు వ‌చ్చిన చైనా ప్ర‌భుత్వం ఇప్పుడు మ‌రో విష‌యంలో మాత్రం నానా ఇబ్బందుల ప‌డుతోంది. ఇత‌ర దేశాల‌కు ప‌నుల మీద వెళ్లిన చైనీయులు తిరిగి వ‌స్తూ వ‌స్తూ క‌రోనా భారీన ప‌డుతున్నారు. ఇలా స్వదేశానికి తిరిగొచ్చిన వారిలో 41 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు ఇలాంటి వారి సంఖ్య కూడా 269కు చేరుకుంది. అయితే రోజు రోజుకు వీరి సంఖ్య ఎక్కువ అవ్వ‌డంతో వీరిని గుర్తించ లేని ప‌రిస్థితి. ఇప్పుడు వీరి ద్వారా క‌రోనా మ‌రి కొంత మందికి సోకుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: