దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకూ కరోనా భారీన పడి నలుగురు మృతి చెందగా తాజాగా మరో మరణం సంభవించింది. 63 ఏళ్ల వృద్ధుడు మహారాష్ట్రలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 324కు పెరిగింది. 
 
దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. భారత ఆరోగ్య శాఖ దేశంలోని 22 రాష్ట్రాల్లో ఈ వైరస్ విస్తరించినట్లు ప్రకటన చేసింది. కరోనా భారీన పడి ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో నలుగురు మృతి చెందారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ కొరకు పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆంక్షల ప్రభావం కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఈశాన్య రాష్ట్రాల్లో నిన్న తొలి కేసు నమోదైంది. అసోంలోని నాలుగేళ్ల బాలికకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారగా ప్రజలు స్వచ్చందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దేశంలో జనతా కర్ఫ్యూ కొనసాగనుంది. 
 
సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలు కరోనా ముందుజాగ్రత్తచర్యల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఏపీలో అధికారులతో పాటు ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కరోనా సోకకుండా చర్యలు చేపడుతున్నారు.        

మరింత సమాచారం తెలుసుకోండి: